ఐరాస యుద్ధ నేర కమిటి పర్యటనపై నిషేధం ఎత్తివేసిన శ్రీలంక

సోమవారం, 20 డిశెంబరు 2010 (09:38 IST)
శ్రీలంకలో మరణించిన యుద్ధ ఖైదీల మృతిపై ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసిన యుద్ధ నేరాల విచారణ కమిటీపై విధించిన నిషేధాన్ని శ్రీలంక ప్రభుత్వం ఎత్తివేసింది. దీంతో యుఎన్‌ వార్‌ క్రైమ్‌ పానెల్‌ త్వరలోనే శ్రీలంకలో పర్యటించనుందని ఐక్యరాజ్య సమితి అధికార వర్గాలు వెల్లడించాయి.

శ్రీలంకలోని నిషేధిత ఉగ్రవాద సంస్థ లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం (ఎల్టీటిఇ)పై దాదాపు 25 ఏళ్ళ పాటు జరిపిన పోరుపై ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి బాన్‌ కీ-మూన్‌ త్రిసభ్య పానెల్‌ కమిటీ నియమించారు. దీని ప్రకారం ఈ కమిటీల శ్రీలంకలో పర్యటించి యుద్ధ నేరాలపై దర్యాప్తు చేపట్టాల్సి ఉంది.

అయితే ఈ కమిటీని శ్రీలంక ప్రభుత్వం వ్యతిరేకిస్తూ.. పానెల్‌లోని ముగ్గురు సభ్యులకు వీసా అనుమతి నిరాకరించి, పానెల్‌ కమిటీ పర్యటనపై నిషేధం విధించింది. దీంతో ఐక్యరాజ్య సమితి కార్యదర్శి ఈ విషయంలో జోక్యం చేసుకొని శ్రీలంక ప్రభుత్వాధినేతలతో సంప్రదింపులు జరుపడంతో సమస్య సద్దుమనిగింది.

వెబ్దునియా పై చదవండి