విదేశీ దళాలను మా భూభాగంపై అడుగుపెట్టనీయం: పాక్

తీవ్రవాదం అణిచివేతపై ప్రపంచ దేశాలు సాగిస్తున్న పోరులో భాగంగా విదేశీ దళాలను తమ భూభాగంపై కాలుమోపేందుకు అంగీకరించబోమని పాకిస్థాన్ కుండబద్ధలుకొట్టినట్టు చెప్పింది. దీనిపై ఆ దేశ విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అబ్దుల్ బాసీత్ శనివారం ఒక పత్రికకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. తీవ్రవాదాన్ని అణిచి వేసే విషయంలో పాకిస్థాన్ ఎప్పుడు కూడా వెనకడుగు వేయలేదన్నారు.

ఇప్పటికే, తాలిబాన్, అల్‌ఖైదా వంటి తీవ్రవాద సంస్థలను నిర్వీర్యం చేసేందుకు అమెరికా నేతృత్వంలోని నాటో దళాలు తమ దేశ సరిహద్దుల్లో పొంచివున్నాయన్నారు. వీరిని తమ దేశ భూభాగంలోని చొచ్చుకువచ్చేందుకు తాము అంగీకరించడం లేదన్నారు.

ఈ పరిస్థితుల్లో అమెరికా తన దళాలను పాకిస్థాన్‌లోని వజీరిస్థాన్ వరకు మొహరించనున్నట్టు వార్తలు వస్తున్నాయన్నారు. తమ అనుమతి లేకుండా విదేశీ సేనలు తమ భూభాగంలోకి అడుగుపెట్టడానికి వీలులేదని ఆయన తేల్చి చెప్పారు

వెబ్దునియా పై చదవండి