అగ్రరాజ్యంలో ఆకలి కేకలు: మరింత పెరిగిన పేదల సంఖ్య

శుక్రవారం, 7 జనవరి 2011 (09:56 IST)
అగ్రరాజ్యంలో ఆకలి కేకలు పెట్టే వారి సంఖ్య మరింత పెరిగింది. అమెరికాలో నివసిస్తున్న ప్రతి ఆరుగురిలో ఒకరు పేదరికంలో మగ్గుతున్నట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. వీరిలో ఎక్కువగా.. 65 ఏళ్ళ వయస్సుకు పైబడిన వారే ఉన్నారు.

ఈ వయోవృద్ధుల్లో ముఖ్యంగా ఆరోగ్య రక్షణ, ఇతర వ్యయాలు పెరగడం వీరి పేదరికంలోకి జారుకున్నాని ఆ నివేదిక వెల్లడించింది. సవరించిన జనాభా లెక్కల ప్రకారం 2009లో మొత్తం పేదరిక రేటు 15.7 శాతం (లేదా 4.78 కోట్ల మంది)గా ఉంది. గతేడాది జనాభ గణాంక బ్యూరో ఇచ్చిన నివేదికలోని 14.3 శాతం (లేదా 4.36 కోట్ల) కంటే ఇది ఎక్కువగా ఉంది.

వెబ్దునియా పై చదవండి