బరాక్ ఒబామా పాలనా వ్యవస్థలో కీలక మార్పులు

శుక్రవారం, 7 జనవరి 2011 (10:56 IST)
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పాలనా వ్యవస్థలు కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్‌కు అత్యంత నమ్మకస్తుడిగా పనిచేసిన విలియమ్ డాలీను తన "ఛీఫ్ ఆఫ్ స్టాఫ్" (సిబ్బందికి అధిపతి)గా నియమించనున్నట్లు ఒబామా ప్రకటించారు.

చికాగోకు చెందిన డాలీ క్లింటన్ హయాంలో వాణిజ్య కార్యదర్శిగా పనిచేశారు. ప్రస్తుతం జెపి మోర్గాన్‌ చేజ్‌కు ఎగ్జిక్యూటివ్‌గా వ్యవహరిస్తున్నారు. కాగా.. డాలీ నియామకాన్ని తక్షణమే ఆహ్వానిస్తున్నట్లు ఒబామా కఠిన ఆర్థిక విధానాలను అవలంభిస్తున్న అమెరికా చాంబర్స్ ఆఫ్ కామర్స్ ప్రకటచింది.

ఒబామా తన పాలనా వ్యవస్థను మరింత పటిష్టంగా, సమర్థవంతంగా నిర్వహించేదుకు హై-ప్రొఫైల్ కలిగిన సిబ్బందిని నియమిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో వైట్ హౌస్ ప్రెస్ కార్యదర్శి పదవిని కూడా త్వరలోనే ఒబామా భర్తీ చేయనున్నారు.

ప్రస్తుత ప్రెస్ కార్యదర్శిగా ఉన్న రాబర్ట్ గిబ్స్ ఈ ఏడాది ఫిబ్రవరిలో వైట్ హౌస్‌ను వదలిపెట్టాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించడంతో ప్రస్తుతం ఆ పోస్టు కూడా ఖాలీ ఏర్పడనుంది. మరోవైపు తన ఆర్థిక బృందంలో కూడా మార్పులు చేయనున్నారు. త్వరలోనే ఒబామా తన నూతన ఆర్థిక సలహాదారుల వివరాలను కూడా వెల్లడించనున్నారు.

వెబ్దునియా పై చదవండి