వాషింగ్టన్‌కు చేరుకున్న మీనన్: యూఎస్‌తో కీలక చర్చలు
జాతీయ భద్రతా సలహాదారు శివశంకర్ మీనన్ శుక్రవారం వాషింగ్టన్‌కు చేరుకున్నారు. ఈ పర్యటనలో ఆయన ఆ దేశ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్‌తో సహా అమెరికా అధ్యక్ష యంత్రాంగంతో కూడా దశలవారీగా చర్చలు జరుపుతారు. వాతావరణం అనుకూలించక నిర్ణీత షెడ్యూల్ కంటే కొన్ని గంటల ఆలస్యంగా వాషింగ్టన్‌కు చేరుకుంది.
గత యేడాది నవంబరు నెలలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పర్యటన సమయంలో కుదుర్చుకున్న ఒప్పందాలు పురోగతి, అమలు తీరును ఆయన సమీక్ష చేస్తారు. అలాగే, న్యూఢిల్లీలో జరుగనున్న వ్యూహాత్మక చర్చల్లో భాగంగా ఇండో-యూఎస్ ద్వైపాక్షిక సంబంధాలు, పురోగతి అంశాలపై కూడా చర్చిస్తారని స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధి పీజే.క్రౌలీ వెల్లడించారు.
వాషింగ్టన్‌కు మీనన్ ఆలస్యంగా చేరుకోవడంతో విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్‌తో గత రాత్రి జరగాల్సిన విందు కార్యక్రమాన్ని రద్దు చేశారు. అయితే, శుక్రవారం వారి మధ్య జరగాల్సిన సమావేశం మాత్రం యధావిధిగా జరుగుతుందని క్రౌలీ వెల్లడించారు.