దావూద్ ఇబ్రహీం అరెస్టుకు అమెరికా సాయం: భారత్

మంగళవారం, 10 సెప్టెంబరు 2013 (14:40 IST)
File
FILE
అండర్ వరల్డ్, మాఫియా డాన్, 1993 ముంబై వరుస బాంబు పేలుళ్ల కేసులో ప్రధాన సూత్రధారి అయిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్ ఇబ్రహీంను పట్టుకునేందుకు అమెరికా సాయాన్ని భారత్ కోరనుంది. ఇందుకోసం పక్కా ప్రణాళికను రచిస్తోంది. పాకిస్థాన్‌లోని ఓడరేవు పట్టణమైన కరాచీలో సురక్షిత స్థావరంలో ఉంటున్న దావూద్‌ను అరెస్ట్ చేసేందుకు భారత్ తన వంతు ప్రయత్నాలు ఆరంభించింది. ఇందుకోసం అమెరికా ప్రభుత్వ సహాకారం తీసుకుంటామని కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే వెల్లడించారు.

ఇప్పటికే కొంత మంది ఉగ్రవాదులను అరెస్ట్ చేశాం. మరికొంత మంది సరిహద్దుల్లో మరణించారు. అయితే దావూద్‌ను అరెస్ట్ చేసేందుకు అమెరికా ఉన్నత స్థాయి దర్యాప్తు సంస్థ ఎఫ్.బి.ఐతో సంప్రదింపులు జరుపుతున్నట్టు ఆయన తెలిపారు. ఇప్పటికే దావూద్ ఇబ్రహీంపై రెడ్ కార్నర్ నోటిస్ ఉందని ఆయన గుర్తు చేశారు.

వెబ్దునియా పై చదవండి