నోబెల్ శాంతి బహుమతి రేసులో వ్లాదిమిర్ పుతిన్!

గురువారం, 3 అక్టోబరు 2013 (09:22 IST)
File
FILE
నోబెల్ శాంతి బహుమతి రేసులో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పేరును ఓ అంతర్జాతీయ సంస్థ ప్రతిపాదించింది. సిరియా సంక్షోభాన్ని రాజకీయంగా, దౌత్యపరంగా పరిష్కరించేందుకు పుతిన్ చేస్తున్న కృషికి గాను ఆయన పేరును ప్రతిపాదించినట్లు ప్రపంచ దేశాల ఆధ్యాత్మిక ఐక్యత, సహకార సంస్థ ఉపాధ్యక్షుడు బెస్లాన్ కోబాజియా వెల్లడించారు.

ఇదే అంశంపై ఆ సంస్థ ప్రతినిధి స్పందిస్తూ... సిరియాలోని రసాయనాయుధాల నిర్మూలన, ఆ దేశంపై అమెరికా క్షిపణి దాడుల నివారణలో చొరవ చూపుతూ పుతిన్ శాంతి స్థాపనలో తీవ్రంగా కృషి చేశారని, ఫలితంగానే సిరియాపై అమెరికా యుద్ధానికి వెనుకంజ వేసిందని గుర్తు చేశారు.

కాగా, కాగా పుతిన్ పేరును ప్రతిపాదిస్తూ నోబెల్ కమిటీకి సెప్టెంబర్ 15న లేఖ రాయగా 20న అందినట్లు వచ్చిన వార్తలను పుతిన్ మీడియా కార్యదర్శి తోసిపుచ్చారు. నామినేషన్ గురించి పుతిన్ ఆ సంస్థతో చర్చించలేదన్నారు. నామినేషన్‌కు ఫిబ్రవరి 1 ఆఖరు తేదీ కాగా వచ్చే ఏడాది అక్టోబర్ 12న విజేత పేరు ప్రకటిస్తారు.

వెబ్దునియా పై చదవండి