ఎస్పీ టిక్కెట్టుపై సంజయ్ దత్ పోటీ: అమర్

FileFILE
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ తరపున ఎన్నికల బరిలోకి దిగనున్నాడు. ఈ విషయాన్ని ఆ పార్టీ సీనియర్ నేత, ప్రధాన కార్యదర్శి అమర్ సింగ్ గురువారం వెల్లడించారు. బాలీవుడ్ హీరో సంజయ్ దత్ లక్నో లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని ఆయన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ విషయంపై తాను సంజయ్‌తో మాట్లాడానని ఆయన తన ప్రతిపాదనకు అంగీకరించారని వెల్లడించారు.

సంజయ్ దత్ క్రిమినల్ కాదని, ఆయన్ను ఐక్యరాజ్య సమితి అంబాసిడర్‌గా నియమించిందని అమర్ సింగ్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం లోక్నో నియోజకవర్గం నుంచి మాజీ ప్రధాని, భాజపా అగ్రనేత అటల్ బీహారీ వాజ్‌పేయి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఇదిలావుండగా సంజయ్ దత్ సోదరి ప్రియాంకా దత్ ముంబై పశ్చిమ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ ఎంపీగా కొనసాగుతున్నారు.

ఇదిలావుండగా.. ముంబై వరుస పేలుళ్ల కేసులో సంజయ్‌ దత్‌కు టాడా ప్రత్యేక కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెల్సిందే. ఈ కేసులో సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన ప్రస్తుతం బాహ్య ప్రపంచంలోకి వచ్చారు.

వెబ్దునియా పై చదవండి