రాయలసీమ, కోస్తా ఎంపీలూ.. ఆందోళనవద్దు: ప్రధాని

తెలంగాణాపై కేంద్రం ప్రకటన నేపధ్యంలో కోస్తా, రాయలసీమ ప్రాంత ఎంపీలు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌తో సమావేశమయ్యారు. తామంతా సమైక్య ఆంధ్రకు కట్టుబడి ఉన్నామనీ, తెలంగాణా ప్రకటన నేపధ్యంలో ఆంధ్ర, రాయలసీమ ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం.

ఎంపీలు చెప్పిన మాటలను ప్రధాని మన్మోహన్ సింగ్ శ్రద్ధగా ఆలకించారు. సుమారు అరగంటపాటు సమావేశమైన అనంతరం ప్రధాని ఎంపీలతో మాట్లాడుతూ.. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని వారికి సూచించారు. కోర్ కమిటీలో అందరి అభ్యంతరాలను పరిశీలించిన మీదట తెలంగాణా అంశంపై తగు నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం.

ప్రధానితో చర్చ ముగిసిన అనంతరం ఎంపీలు ప్రణబ్ ముఖర్జీతో సమావేశమయ్యారు. ప్రణబ్ తో సమైక్య ఆంధ్రకే కట్టుబడి నిర్ణయం ప్రకటించాలని అభ్యర్థించారు. ఈ నేపధ్యంలో గతంలో తెలంగాణాపై చిదంబరం ప్రకటనకు కొన్ని సవరణలు చేర్చి మరోసారి ప్రకటన జారీ చేసే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం.

వెబ్దునియా పై చదవండి