హైదరాబాద్ జంట పేలుళ్లు: కీలక తీవ్రవాది అరెస్టు!

సోమవారం, 18 జనవరి 2010 (16:31 IST)
గత 2007 సంవత్సరంలో హైదరాబాద్‌లో జరిగిన జంట పేలుళ్ళ కేసుల్లో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న హర్కత్ అల్ జిహాద్ అల్ ఇస్లామీ సంస్థకు చెందిన టాప్ కమాండర్ అజ్మద్ అలియాస్ షేక్ అబ్దుల్ ఖవాజాను చెన్నయ్‌లో పోలీసులు సోమవారం అరెస్టు చేశారు.

ఈనెల 26వ తేదీన జరుగనున్న గణతంత్ర వేడుకలను భగ్నం చేసేందుకు కుట్రపన్నినట్టు పోలీసులు విచారణలో వెల్లడైంది. దక్షిణ భారతదేశంలోని నాలుగు ప్రధాన నగరాల్లో ఒక సిటీలో ఈ విధ్వంసం సృష్టించేందుకు పథక రచన చేసినట్టు సమాచారం.

కాగా, 2007లో హైదారాబాద్‌లోని గోకుల్ ఛాట్, లుంబిని పార్కులలో జరిగిన జంట పేలుళ్లలో 49 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెల్సిందే. ఈ కేసుతో పాటు.. 2005లో టాస్క్ ఫోర్స్ కార్యాలయం సమీపంలో జరిగిన ఆత్మాహుతి దాడి కేసులో అంజాద్ ప్రధాన సూత్రధారి కావడం గమనార్హం.

గత 2003 సంవత్సరం నుంచి కరాచీలో ఉంటున్న అంజాద్.. రిపబ్లిక్ డే వేడుకల్లో విధ్వంసం సృష్టించేందుకు భారత్‌కు వచ్చినట్టు పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం విచారణ నిమిత్తం హైదరాబాద్‌కు తరలించేందుకు అధికారులు నిర్ణయించారు

వెబ్దునియా పై చదవండి