దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కమల్ హాసన్ రంగరాయ శక్తివేల్ నాయకర్‌గా నటించారు. శింబు, త్రిష కృష్ణన్, ఐశ్వర్య లక్ష్మి, అశోక్ సెల్వన్, అభిరామి, జోజు జార్జ్, నాసర్, అలీ ఫజల్, సన్యా మల్హోత్రా వంటి వారు ముఖ్య పాత్రలను పోషించారు.
రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, ఆర్. మహేంద్రన్, మద్రాస్ టాకీస్, శివ అనంత్ నిర్మించిన థగ్ లైఫ్ ప్రస్తుతం అందరి అంచనాలను అమాంతం పెంచేసింది. ఈ పాటకు కమల్ హాసన్ సాహిత్యాన్ని అందించారు. ఇక రెహమాన్ బాణీ ఎంతో ఉల్లాసభరితంగా ఉంది.
థగ్ లైఫ్ చిత్రాన్ని తమిళనాడులో రెడ్ జెయింట్ మూవీస్, ఓవర్సీస్‌లో హోమ్ స్క్రీన్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో, AP ఇంటర్నేషనల్ సంయుక్తంగా రిలీజ్ చేస్తున్నాయి. ఇక నార్త్ ఇండియాలో పెన్ మరుధర్ సినీ ఎంటర్‌టైన్‌మెంట్, తెలుగులో శ్రేష్ట్ మూవీస్ ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాయి. కర్ణాటకలో ఫైవ్ స్టార్ సెంథిల్ భారీ ఎత్తున విడుదల చేస్తోంది.
ఇదిలా వుండగా, థగ్ లైఫ్ ఆడియో హక్కులను సారెగామా తీసుకోగా, ఈ చిత్ర డిజిటిల్ హక్కుల్ని నెట్‌ఫ్లిక్స్ చేజిక్కించుకుంది. జూన్ 5, 2025న ప్రపంచవ్యాప్తంగా థగ్ లైఫ్ థియేటర్లలో విడుదలకు సిద్ధం అవుతోంది. జస్ట్ గ్రో ప్రొడక్షన్స్ సహకారంతో థగ్ లైఫ్ ఫెస్టివల్‌ను కూడా టీం ప్రకటించింది. ఇది మే 23వ తేదీన శుక్రవారం నాడు ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఈ ఈవెంట్ జరగనుంది. ఆ మ్యూజికల్ ఈవెంట్‌లో ఏఆర్ రెహమాన్ కూడా ప్రదర్శన ఇవ్వనున్నారు.