వచ్చే సమావేశాల నాటికి లోక్‌పాల్ బిల్లు: మంత్రి మొయిలీ

శుక్రవారం, 7 జనవరి 2011 (09:09 IST)
వచ్చే సమావేశాల నాటికి లోక్‌పాల్ బిల్లు రావొచ్చిని కేంద్ర న్యాయ శాఖామంత్రి వీరప్ప మొయిలీ అన్నారు. అయితే, బడ్జెట్ సమావేశాల్లో ఈ బిల్లును పెట్టాలన్న అంశంపై కేంద్ర మంత్రివర్గం రెండుగా చీలిపోయింది. మెజారిటీ మంత్రులు ఈ బిల్లును వ్యతిరేకించారు.

గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో దీనిపై చర్చ జరిగింది. ఎక్కువ మంది మంత్రుల నుంచి వ్యతిరేకించడంతో పెద్దగా చర్చ జరుపకుండానే మంత్రిమండలి సమావేశం ముగిసింది. దీనిపై కేంద్ర న్యాయశాఖ మంత్రి వీరప్పమొయిలీ మాట్లాడుతూ, వచ్చే పార్లమెంటు సమావేశాల్లో లోక్‌పాల్ బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉందన్నారు.

కానీ, దీనిపై ప్రభుత్వం ఏ మేరకు ముందుకు సాగుతుందన్న ప్రశ్నకు సమాధానాన్ని ఆయన దాటవేశారు. మరోవైపు, రిపబ్లిక్ డే నాటికల్లా ఈ బిల్లును తీసుకురావాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. లోక్‌పాల్ వ్యవస్థ గనుక ఏర్పడితే ప్రధానితో సహా మంత్రులు, ఎంపీలు సైనికాధికారులు అంతా దీనికిందకు వస్తారు. వారు అవినీతి కార్యకలాపాలకు పాల్పడితే విచారణ చేపట్టే అధికారం లోక్‌పాల్‌కు ఉంటుంది.

వెబ్దునియా పై చదవండి