అంతర్గత భద్రతపై ఫిబ్రవరి 1న ముఖ్యమంత్రుల సదస్సు!!

దేశ అంతర్గత భద్రతపై వచ్చేనెల ఒకటో తేదీన అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఒక సదస్సును నిర్వహించేందుకు కేంద్ర హోంశాఖ నిర్ణయించింది. ఈ సదస్సును ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రారంభిస్తారు.

ఇటీవలి కాలంలో దేశ వ్యాప్తంగా నక్సల్స్ దుశ్యర్యలతో పాటు ఉగ్రవాద కార్యకలాపాలు హెచ్చుమీరిన విషయం తెల్సిందే. ప్రధానంగా దేశంలోని కొన్ని అతివాద గ్రూపులు కూడా ఈ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ దేశ అంతర్గత భద్రకతు పెను సవాల్ విసురుతున్నాయి.

వీటితో పాటు దేశ భద్రతపై తీసుకోవాల్సిన అంశాలపై చర్చించేందుకు ఈ సమావేశం నిర్వహించనున్నారు. ఇందులో ప్రధానమంత్రి మన్మోహన్‌తో పాటు.. కేంద్ర హోంశాఖామంత్రి చిదంబరం, ఆ శాఖ కార్యదర్శి జీకేపిళ్లై, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, డీపీజీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు పాల్గొనే అవకాశం ఉంది.

వెబ్దునియా పై చదవండి