డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

సిహెచ్

బుధవారం, 26 ఫిబ్రవరి 2025 (20:43 IST)
డ్రై ఫ్రూట్స్. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఐతే ఈ గింజలను నానబెట్టుకుని తింటే ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు రెట్టింపవుతాయంటున్నారు నిపుణులు. అదెలాగో తెలుసుకుందాము.
 
బాదం పప్పులను నానబెట్టి తింటే మన శరీరానికి పోషకాలను గ్రహించే శక్తిని కలిగిస్తాయి.
గుమ్మడి గింజలను రాత్రంతా నానబెట్టుకుని తింటే అందులోని ఆరోగ్యకరమైన కొవ్వులు శరీరానికి అందుతాయి.
వాల్ నట్స్ నీటిలో నానబెట్టుకుని తింటే అవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
ఓట్స్ ను గంటపాటు నానబెట్టుకుని ఉడికించి తింటే పిండిపదార్థం విచ్ఛిన్నమై జీర్ణశక్తి మెరుగవుతుంది.
కిస్ మిస్‌లను రాత్రంతా నానబెట్టి తింటే వాటిలోని పోషకాలు రెట్టింపవుతాయి.
సబ్జా గింజలను నీటిలో నానబెట్టి తాగితే అవి శరీరాన్ని హైడ్రేట్‌గా వుంచుతాయి.
అవిసె గింజలను రాత్రిపూట నానబెట్టి ఉదయాన్నే తీసుకుంటే జీర్ణశక్తి మెరుగవుతుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు