టీజర్ లో మించిన వినోదం మ్యాడ్ స్క్వేర్ చిత్రంలో ఉంటుంది : చిత్ర బృందం

దేవి

శుక్రవారం, 28 ఫిబ్రవరి 2025 (19:29 IST)
Sangeet Shobhan, Ram Nithin, Suryadevara Nagavanshi, Kalyan Shankar, Harika Suryadevara
'మ్యాడ్' చిత్రంకి సీక్వెల్ గా రూపొందుతోన్న 'మ్యాడ్ స్క్వేర్' కోసం సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, విష్ణు ఓఐ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ పతాకాలపై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు.

2025, మార్చి 29న ప్రపంచ వ్యాప్తంగా భారీస్థాయిలో ఈ చిత్రం విడుదల కానుంది. ఇటీవల విడుదలైన టీజర్ కు విశేష స్పందన లభించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం ఐటీసీ కోహినూర్ లో ప్రెస్ మీట్ నిర్వహించిన చిత్ర బృందం, సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.
 
నార్నే నితిన్ మాట్లాడుతూ, "మ్యాడ్-1 కి అద్భుతమైన స్పందన లభించింది. ఈసారి మ్యాడ్-2 దానికి మించి ఉంటుంది. థియేటర్లలో ఎవరూ సీట్లలో కూర్చొని ఉండరు. అంతలా నవ్వుతారు సినిమా చూస్తూ. ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను." అన్నారు.
 
సంగీత్ శోభన్ మాట్లాడుతూ, "మీరు టీజర్ లో చూసింది చాలా తక్కువ. సినిమాలో అంతకుమించిన వినోదం ఉంటుంది. మ్యాడ్ స్క్వేర్ పై అంచనాలు, ఊహించిన దానికంటే ఎక్కువ ఉన్నాయి. మ్యాడ్ సినిమా సమయంలో నిర్మాత వంశీ గారు ఒక మాట చెప్పారు.. సినిమా నచ్చకపోతే టికెట్ డబ్బులు వెనక్కి ఇస్తామని. ఇప్పుడు ఆయన మాటగా నేను చెప్తున్నా.. ఎవరికైనా సినిమా నచ్చకపోతే టికెట్ డబ్బులకి డబుల్ ఇచ్చేస్తాం. మళ్ళీ సక్సెస్ మీట్ లో కలుద్దాం." అన్నారు.
 
రామ్ నితిన్ మాట్లాడుతూ, "మ్యాడ్ సినిమా సమయంలో మాకు అందరూ ఎంతో సపోర్ట్ చేశారు. మొదటి సినిమాకి అంత ఆదరణ రావడం అనేది మామూలు విషయం కాదు అన్నారు.
 
నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ, "మంచి సినిమా తీశాము. మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాము. రెండు గంటల పాటు మనస్ఫూర్తిగా నవ్వుకోవడానికి ఈ సినిమాకి రండి. స్నేహితులతో కలిసి మా సినిమా చూసి ఎంజాయ్ చేయండి." అన్నారు.
 
దర్శకుడు కళ్యాణ్ శంకర్ మాట్లాడుతూ, "మ్యాడ్ సినిమాను మీరందరూ చూసి ఎంజాయ్ చేశారు. 'మ్యాడ్ స్క్వేర్' అయితే దానికి పది రెట్లు ఉంటుంది. ప్రతి సీనూ మిమ్మల్ని నవ్విస్తుంది. ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కొడుతున్నాం అనే నమ్మకం ఉంది." అన్నారు.
 
నిర్మాత హారిక సూర్యదేవర మాట్లాడుతూ, "మ్యాడ్ సినిమా సమయంలో మీడియా ఇచ్చిన సపోర్ట్ ను మర్చిపోలేము. మ్యాడ్ స్క్వేర్ కి కూడా అలాగే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇటీవల విడుదలైన టీజర్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మ్యాడ్ స్క్వేర్ పై ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుంది. మ్యాడ్ స్క్వేర్ టైటిల్ కి తగ్గట్టుగానే రెట్టింపు వినోదం ఉంటుంది అన్నారు.
 
సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో మాట్లాడుతూ, "మ్యాడ్ ను పెద్ద హిట్ చేశారు. మ్యాడ్ స్క్వేర్ దానిని మించి ఉండబోతుంది. ఈ సినిమా ఘన విజయం సాధిస్తుందని బలంగా నమ్ముతున్నాను. కళ్యాణ్ గారు లాంటి దర్శకుడితో పని చేయడం సంతోషంగా ఉంది. మునుముందు మరిన్ని మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. వంశీ గారికి, చినబాబు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ సినిమాలో నటించిన ముగ్గురు హీరోలూ భవిష్యత్ లో పెద్ద స్టార్ లు అవుతారు. పాటలను పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు నా ధన్యవాదాలు అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు