అండమాన్ మహిళల నగ్న నృత్యాలపై హోంశాఖ సీరియస్!

బుధవారం, 11 జనవరి 2012 (15:31 IST)
అడమాన్ దీవుల్లో జరావాస్ తెగకు చెందిన గిరిజన మహిళల నగ్న నృత్యాలపై కేంద్రం హోంశాఖ కన్నెర్రజేసింది. దీనిపై 24 గంటల్లో పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని అండమాన్ డీజీపీని ఆదేశించింది.

ఈ తెగకు చెందిన మహిళలు పొట్టకూటి కోసం ఇక్కడకు వచ్చే పర్యాటకుల ముందు నగ్న నృత్యాలు చేస్తూ డబ్బులు సంపాదించుకుంటున్నట్టు బ్రిటీష్ పత్రిక ఒకటి వార్తా కథనాన్ని ప్రచురించిన విషయం తెల్సిందే.

ఈ కథనం దేశంలో సంచలనం సృష్టించింది. దీనిపై స్పందించిన కేంద్ర హోంశాఖ 24 గంటల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఘటనకు బాధ్యులైన వారిని ఉపేక్షించబోమని హెచ్చరించింది. మరోవైపు జరావాస్‌ వీడియో పదేళ్ళ క్రితం నాటిదని అండమాన్‌ డీజీపీ వ్యాఖ్యానిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి