ఆమె తనపై జరిగిన లైంగిక వేధింపులు గురించి మాట్లాడుతూ... షూటింగ్ షాట్ గ్యాపులో నేను మేడపైకి వెళ్లేందుకు మెట్లు ఎక్కుతున్నాను. ఇంతలో నా వెనుక నుంచి నేను ధరించిన టాప్ ను ఓ చేయి పైకి లేపుతోంది. నేను వెనక్కి తిరిగే లోపు అతడి చేయి నా నడుమును తడుముతోంది. వెంటనే ఆ బడా నిర్మాత వైపు నేరుగా చూసి, మీరు చేస్తున్న పని ఏంటి అన్నాను. దానికి అతడు పళ్లు ఇకిలిస్తూ, గాలికి నీ టాప్ పైకి లేచింది. దాన్ని సరిచేస్తున్నా అన్నాడు. దాంతో నేను అతడితో, అది ఎందుకు పైకి లేచిందో నాకు తెలుసు.
అసలు నా మీద చేయి వేయడానికి మీకు ఎంత ధైర్యం అన్నప్పటికీ అదే వెకిలి నవ్వులు నవ్వుతూ వెళ్లిపోయాడు. మరో షూటింగ్ సమయంలో ఓ దర్శకుడు నాతో రాత్రికి డ్రింక్ చేయడానికి రావచ్చు కదా అని అడిగాడు. ఆరోజు రాత్రి నేరుగా అతడి గదికి వెళ్లి తలుపు తెరిచాను. అతడితో... ఏమయ్యా నీకు మా నాన్న వయసు వుంది. నీకు ఇదేం పాడుబుద్ధి అని చీవాట్లు పెట్టాను. అందరూ షాకై నావైపు చూస్తూ నిలబడిపోయారు'' అంటూ చెప్పుకొచ్చింది.