చిన్న ఉల్లిపాయలతో కోడిమాంసం కూర

FILE
కావలసిన పదార్థాలు :
మంచి నూనె.. వంద గ్రాములు
ఉప్పు.. తగినంత
చిన్న ఉల్లిపాయలు.. అరకిలో
ఎండుమిర్చి.. ఎనిమిది
కోడిమాంసం.. అర కిలో
పసుపు.. కొద్దిగా

తయారీ విధానం :
బాణలి వేడయ్యాక మంచినూనె పోసి వేడయిన తర్వాత అందులో ఎండుమిరపకాయలు, సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని వేసి వేయించాలి. బాగా వేగాక అందులో చికెన్ ముక్కల్ని వేసి వేయించాలి. చికెన్ రంగుగా కనిపించాలంటే కాస్తంత పసుపును కలుపుకోవచ్చు.

కాసేపయ్యాక అందులో నాలుగు గ్లాసుల నీటిని పోసి.. తగినంత ఉప్పు కలిపి ఉడకనివ్వాలి. చికెన్ ముక్కలు బాగా ఉడికి.. కూర దగ్గరికి అయ్యిందని అనిపిస్తే దించేయాలి. అంతే చిన్న ఉల్లిపాయలతో తయారైన కోడిమాంసం కూర సిద్ధం. చిన్న ఉల్లిపాయల ఘుమఘమలతో ఉండే ఈ కర్రీని.. రోటీలకుగానీ రైస్‌కుగానీ సైడ్‌‌డిష్‌గా వాడుకోవచ్చు.

వెబ్దునియా పై చదవండి