ఆక్స్‌ఫర్డ్ వర్శిటీ స్టూడెంట్ నేతగా భారతీయ సంతతి విద్యార్థిని

శుక్రవారం, 21 మే 2021 (15:20 IST)
ప్రపంచంలోని అత్యంత ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల్లో ఒకటి ఆక్స్‌ఫర్డ్ వర్శిటీ. ఈ యూనివ‌ర్సిటీ విద్యార్థి సంఘం అధ్య‌క్షురాలిగా భార‌త సంత‌తి యువ‌తి ఎన్నికైంది. స్టూటెండ్ యూనియ‌న్‌కు జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో ఇండియ‌న్ ఆరిజ‌న్ అన్వీ భుటానీ ఘ‌న విజ‌యం సాధించింది. 
 
ఈ మేర‌కు వ‌ర్సిటీ అధికారులు గురువారం అర్థరాత్రి ప్ర‌క‌టించారు. ఆమె ప్ర‌స్తుతం వ‌ర్సిటీలోని మ్యాగ్డ‌లెన్ కాలేజీలో హ్యూమ‌న్ సైన్స్‌ విద్యాభ్యాసం చేస్తోంది. భార‌త సంత‌తికే చెందిన విద్యార్థి ర‌ష్మీ సంత్ త‌న ప‌ద‌వికి రాజీనామా చేయ‌డంతో స్టుడెంట్ యూనియ‌న్‌కు ఉప ఎన్నిక జ‌రిగింది. దీంతో మ‌రోమారు ఇండియ‌న్ ఆరిజ‌న్ గెలుపొంద‌డం విశేషం.
 
కాగా, 2021-22 విద్యా సంవ‌త్స‌రానికిగాను స్టుడెంట్ యూనియ‌న్‌లోని ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీలో ఇండియ‌న్ సొసైటీ ప్రెసిడెంట్‌, రేసియ‌ల్ అవేర్‌నెస్‌, ఈక్వాలిటీ క్యాంపైన్ కో-చైర్ ప‌ద‌వికోసం బ‌రిలో నిలిచింది. దీంతో ఆమెకు భారీగా ఓట్లు పోల‌వ‌డంతో ఏక‌ప‌క్షంగా విజ‌యం సాధించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు