వివరాలలోకి వెళ్తే... అమెరికాలో దొంగ కంపెనీలు ఏర్పాటు చేసి, తాను ఉద్యోగం చేస్తున్న సంస్థను మోసం చేసిన సిస్కో సిస్టమ్స్‌కి చెందిన మాజీ డైరెక్టర్ పృథ్వీరాజ్ భిఖాను ఇటీవల ఆ దేశ పోలీసులు అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. 2017 మధ్య వరకూ ఆ సంస్థకు డైరెక్టర్‌గా ఉన్న ఆయన మారుపేర్లతో కంపెనీలు ఏర్పాటు చేసి సిస్కోకు చెందిన కాంట్రాక్ట్‌లన్నీ వాటికే వెళ్లేలా చేసారని అభియోగాలు నమోదు చేయబడ్డాయి.
ఈ మేరకు 93 లక్షల డాలర్ల నష్టం జరిగినట్లు గుర్తించిన కంపెనీ కేసు పెట్టింది. దీంతో పృథ్వీరాజ్‌ను శాన్‌ఫ్రాన్సిస్కో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో మార్చి ఒకటో తేదీని అరెస్ట్ చేసి ఫెడరల్ కోర్టులో హాజరుపర్చగా 30 లక్షల డాలర్ల బాండ్‌పై విడుదల చేశారు. ఈ కేసు తదుపరి విచారణ ఈ నెల 18న జరుగుతుందని అమెరికా అటార్నీ డేవిడ్ ఆండర్సన్, ఎఫ్‌బీ స్పెషల్ ఏజెంట్ ఇన్‌చార్జి జాన్ బెన్నట్ తెలిపారు. ఈ కేసులో నేరం రుజువైతే 20 ఏళ్ల జైలు శిక్షతోపాటు 2.5 లక్షల డాలర్ల జరిమానా విధించబడే అవకాశం ఉంది.