తెలివి, జ్ఞాపకశక్తి, సామర్థ్యము, చైతన్యవంతమైన, విశాలమైన కళ్ళు కలిగివుంటారు. ఏ కార్యాన్నైనా బాగా ఆలోచించి సావకాశాముగా నిర్ణయం తీసుకునే ఈ జాతకుల స్వభావమును ఇతరులు అర్థం చేసుకోలేరు. ఎవరి నిర్భంధము, బలప్రయోగమును తావివ్వని స్థిరమైన దారుఢ్యము వీరిది.
అయితే తనను నమ్ముకున్న వారిని ఆపద సమయందు కాపాడుట వీరి విశిష్ట గుణము. ప్రసన్న వదనులైన ఈ జాతకులు ఎంతటి సంభ్రమ కార్యములు జరిగినను వీరి అతిశయోక్తి గల శాంతత వహించెదరు. మిత్రజన కార్యములందు అతివాదులుగా కనబడే ఈ జాతకులు ఆలోచన శక్తి కలవారు. ఒక్కొక్కప్పు యుక్తిగా మాట్లాడుతారు.
సంగీత సాహిత్యాది కళలయందు ఆసక్తి ఎక్కువ. స్వతహాగా బుద్దీ బలము గల వీరు అనవసర కార్యముల గురించి ఆలోచించడం ద్వారా మనోసుఖమును తగ్గించుకుంటారు. ఈ జాతకులు పుట్టిన 30 సంవత్సరముల వరకు కష్టములు అధిగమించవలసి ఉంటుంది. 30 సంవత్సరాల తర్వాత అభివృద్ధి వుంటుంది.
ఇకపోతే.. అశ్వనీ నక్షత్ర జాతకులకు కృత్తిక, మృగశిర, పునర్వసు, చిత్త, అనూరాధన, జ్యేష్ట నక్షత్రములు ఏ కార్యమునకు పనికి రావని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.