రాహుగ్రహ దోష శాంతి విధానము ఎలా చేయాలి?

శనివారం, 24 నవంబరు 2012 (18:12 IST)
మేష, సింహ, ధనుర్ మాసాల్లో శని, బుధ, శుక్ర వారాల్లో ఆరుద్ర, స్వాతి శతభిష నక్షత్రాలు కలిసి వచ్చిన రోజు శైవ దేవాలయ పుజారిని మధ్యాహ్నం గం : 1.30 లకు మన స్వగృహమునకు పిలిపించి గృహమధ్య హాలులో 4 మూరల పొగరంగు వస్త్రము పరిచి 4 దోసిల్లు నల్లమినుములు పోయాలి.

ఆ రాశిపై అల్యూమినియం లేక వెండి లేక స్టీలు చెంబును కలశంగా స్థాపించి కలశంపై అష్టదిక్కులకు 8 తమలపాకులు పెట్టి పైన టెంకాయ పెట్టి శివ స్వరూపమగు 3 విభూది రేకులు అడ్డంగా పెట్టి ఆ కలశంపై నైఋతి దిశా ముఖంగా పెట్టాలి.

FILE
కలశం ఎదుట ఎవ్వరు కూర్చోనరాదు. ఆగ్నేయ ముఖ్యంగా శివాలయం పూజారి, వాయువ్య ముఖంగా గృహస్థుడు అతని భార్య కూర్చొనాలి. తరువాత తమ గురువర్గ లగ్న జాతకానుసరంగా స్థాన స్థితి రాహు దోష పరిహారార్థము శతృఋణరోగ పీడా పరిహారార్థం అని సంకల్పించుకోవాలి.

తర్వాత ఆ కలశమునకు సుబ్రమణ్యస్వామి మంత్రముతో రాహు గ్రహ మంత్రములతో ఆవాహన చేసి రాహు గ్రహ సహిత సుబ్రమణ్యస్వామినే నమః పంచామృతాభిషేకం కరిష్యే అని చెప్పి కలశం ముందుభాగాన పెద్ద అల్యూమినియం లేక వెండి లేక స్టీలు తట్టలో రాహు గ్రహ పంచలోహ విగ్రహము శ్రీ సుబ్రమణ్య స్వామి విగ్రహము పంచలోహ లేక వెండి విగ్రహం పెట్టి పంచామృతములతో అభిషేకించి సుబ్రమణ్య స్వామి అష్టోత్తర సహస్ర నామాలతో రాహు అష్టోత్తరాలలో మధ్యాహ్నం గం : 3.00 వరకు పూజా పుష్ప గంధాక్షతులతో పూజించి ధూపదీప నైవేద్యములతో మంగళహారతులు ఇవ్వాలి.

కలశ సహితంగా నల్ల మినుమ గుగ్గిళ్ళు నస్యపు రంగు వస్త్రము రూ. 4 దక్షిణ సంఖ్య మొత్తము 4 వచ్చు విధంగా తాంబూల సహితంగా భార్య భర్తల చేత ధరించి గ్రహం దోష పరిహారార్థం, శతృఋణ రోగ పరిహారార్థం దానం కరిష్యే అని 4సార్లు ఉచ్చరించి అయ్యవారి చుట్టూ 4 సార్లు ప్రదక్షణలు చేసి అవి అన్నియూ ఆయనకు దానంగా ఇచ్చి సాష్టాంగదండ ప్రణామములు ఆచరించి ఆశీర్వాదం పొందాలి.

రాహుగ్రహ పీడాపరిహారార్థం చేసుకున్నది కావున తీర్థ ప్రసాదములు స్వీకరించరాదు. తదుపరి స్నానము చేయాలి. ఈ పూజా కార్యక్రమం అంతా కూడా మధ్యాహ్నం గం : 3 లోపు జరగాలి.

వెబ్దునియా పై చదవండి