హస్త నక్షత్ర జాతకులైతే పచ్చరంగు చేతి రుమాలు వాడండి!
FILE
చంద్రగ్రహాధిపత్య నక్షత్రమైన హస్తనక్షత్రంలో జన్మించిన జాతకులు ఎటువంటి సమస్యలనైనా సునాయాసంగా పరిష్కరించుకోగలుగుతారు. సమస్యలను సులువుగా స్వీకరించే మనసత్త్వాన్ని కలిగివుంటారు. ఇతరుల కష్టాన్ని తేలికగా అర్ధం చేసుకుని, వారిని ఆదుకోవడంలోనూ ముందుంటారు. వృత్తి, ఉద్యోగాల్లో శక్తి సామర్థ్యాలను ప్రదర్శించి గుర్తింపు పొందుతారు.
ఇతరులను ఆకర్షించగలగే అందం, వాక్చాతుర్యతను కలిగి ఉంటారు. చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు జీవితంలో మంచి మలుపుకు దారితీస్తాయి. తల్లిదండ్రులు, పెద్దల వద్ద గౌరవభావం కలిగి ఉంటారు. వైవాహిక జీవితం సర్దుకుపోవడం వల్ల సజావుగా నడుస్తుంది. సహోదరీ వర్గం పట్ల మంచి అభిమానం కలిగి ఉంటారు.
ఎంతోమందికి ఉపాధి కలిగించే ఈ జాతకులు బంధువుల వల్ల కొన్ని ఆపోహలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వంశాభివృద్ధికి, కీర్తిప్రతిష్టలకు ఎటువంటి లోటు కలుగదు. వ్యాపారాల్లో సొంత తెలివితేటలను ప్రదర్శించి రాణిస్తారు.
ఇక హస్త నక్షత్రములో జన్మించిన జాతకులకు 5, 14, 23, 32, 41, 50, 59, 68 వంటి సంఖ్యలు కలిసివస్తాయి. అలాగే 1, 4, 6, 7 సంఖ్యలు కూడా మంచి ఫలితాలనిస్తాయి. అయితే 2, 3, 8, 9 అనే సంఖ్యలు మాత్రం ఈ జాతకులకు ఏ మాత్రం కలిసిరావు.
అదృష్టాన్నిచ్చే రోజు: వీరికి బుధవారం కలిసివస్తుంది. కొన్ని సమయాల్లో శనివారం, శుక్రవారాలు అనుకూలిస్తాయి. కానీ మంగళవారం ఈ జాతకులకు కలిసిరాదు. ఇక పచ్చ, ఆరెంజ్, తెలుపు రంగులు కలిసివస్తాయి.
ఈ రంగుల్లో దుస్తులు ధరించడం ఎప్పుడూ పచ్చ రంగు చేతి రుమాలును వాడటం మంచిది. ఇంకా హస్త నక్షత్ర జాతకులకు పగడము, ముత్య రత్నాలను ధరించడం ద్వారా శుభఫలితాలుంటాయని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.