కొబ్బరికాయని శ్రీ ఫలం అని కూడా అంటారు. ఈ శ్రీఫలంతో అనుకున్నది సాధించవచ్చునని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. జీవితంలో ఏమైనా సమస్యలు తొలగి పోవాలంటే కొబ్బరి కాయ బాగా పని చేస్తుందని పండితులు చెప్తున్నారు. మంగళవారం పూట కొబ్బరి కాయను ఓ ఎర్రటి బట్టలో చుట్టి హనుమంతుడి పాదాల దగ్గర పెట్టి ఉంచాలి. ఇలా చేయడం వల్ల సమస్యలు పూర్తిగా తొలగి పోతాయి.