15-01-2020 బుధవారం మీ రాశి ఫలితాలు - లక్ష్మీ నృసింహ స్వామిని ఆరాధించినట్లైతే

బుధవారం, 15 జనవరి 2020 (05:00 IST)
మేషం: శాస్త్ర సంబంధమైన విషయాలపై ఆసక్తి చూపుతారు. కొంతమంది సూటిపోటి మాటలు పడటం వల్ల మానసిక ఆందోళనకు గురవుతారు. మనోధైర్యంతో మీ ప్రయత్నాలు కొనసాగించండి. పూర్వపు మిత్రులను కలుసుకుంటారు. బంగారు, వెండి, లోహ, వస్త్ర, వ్యాపార రంగాల వారు అధిక ఒత్తిడిని ఎదుర్కొంటారు. 
 
వృషభం: అధికారులతో సంభాషించేటప్పుడు ఆత్మనిగ్రహంతో వ్యవహరించండి. ప్రియతములతో విరామ కాలక్షేపాలలో పాల్గొంటారు. శ్రీవారు, శ్రీమతి వైఖరిలో మార్పు గమనిస్తారు. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి అధికమవుతుంది. ప్రయాణాలు వాయిదా పడతాయి. 
 
మిథునం: ఉపాధ్యాయులకు పనిభారం అధికమవుతుంది. రాజకీయ, కళారంగాల వారికి ప్రభుత్వం నుంచి ఆహ్వానాలు రాగలవు. ఉద్యోగస్తులు విమర్శలను ఎదుర్కొంటారు. కుటుంబీకుల కోసం ధనం విరివిగా వ్యయం చేయాల్సి వుంటుంది. స్త్రీలు రచనలు, కళాత్మక పోటీల్లో రాణిస్తారు. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు.
 
కర్కాటకం: దంపతుల మధ్య కలహాలు తొలగి ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. స్త్రీలకు ప్రకటనలు, స్క్రీమ్‌ల పట్ల ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థినులకు ప్రేమ వ్యవహారాలకు చుక్కెదురవుతుంది. రావలసిన ధనం ఆలస్యంగా చేతికి అందుతుంది. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. ప్రముఖులను కలుసుకుంటారు.
 
సింహం: వృత్తి వ్యాపారాల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తారు. దూర ప్రయాణాల్లో ఊహించని చికాకులు ఎదురవుతాయి. తీర్థయాత్రలు, నూతన ప్రదేశ సందర్శనల పట్ల ఆసక్తి కలుగుతుంది. విదేశాల్లోని ఆత్మీయుల క్షేమసమాచారం ఆందోళన కలిగిస్తుంది. దీర్ఘకాలికంగా వాయిదా పడుతూ వస్తున్న పనులు పూర్తి చేస్తారు.
 
కన్య: ఉద్యోగస్తులకు తోటివారితో సమన్వయం లోపిస్తుంది. శత్రువులపై జయం పొందుతారు. వ్యాపారాల్లో ధనం లాభిస్తుంది. వైద్య రంగాల వారికి శస్త్రచికిత్సల సమయంలో ఏకాగ్రత ముఖ్యం. రాజకీయ నాయకులకు అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. కళ, క్రీడా, సాంకేతిక రంగాల వారికి ప్రోత్సాహకరం.
 
తుల: పంతాలకు పోకుండా బంధువులతో ఆదరంగా మెలగండి. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. భార్యాభర్తల మధ్య బంధం మరింతగా దృఢంగా మారుతుంది. ఆర్థిక లావాదేవీలు సమావేశాలతో హడావుడిగా వుంటారు. ప్రైవేట్ ఫైనాన్స్‌లో మదుపు, వ్యక్తులకు రుణం ఇవ్వడం క్షేమం కాదు.
 
వృశ్చికం: విదేశీయాన యత్నాల్లో స్వల్ప ఆటంకాలెదుర్కుంటారు. బంధుమిత్రుల రాకతో ఖర్చులు అధికమవుతాయి. గృహానికి కావలసిన విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. వాహనం ఇతరులకు ఇచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. ట్రాన్స్ పోర్టు, ఆటో మొబైల్ రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. 
 
ధనస్సు: ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. స్త్రీలకు ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం కూడదు. విద్యార్థులు ధ్యేయం పట్ల మరింత శ్రద్ధ వహిస్తారు. మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది. వ్యాపార వర్గాల వారు పనివారలు, కొనుగోలుదార్లను కనిపెట్టుకోవడం ఉత్తమం.
 
మకరం: ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు బాగా శ్రమించాల్సి వుంటుంది. మీ ఆలోచనలు కార్యరూపం దాల్చి అనుకున్నది సాధిస్తారు. వాణిజ్య ఒప్పందాలు, హామీల విషయంలో అనుభవజ్ఞుల సలహా పాటించడం క్షేమదాయకం. గృహంలో సందడి వాతావరణం నెలకొంటుంది. తరచు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు.
 
కుంభం: రుణం తీసుకోవడం, ఇవ్వడం క్షేమం కాదని గమనించండి. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి అచ్చు తప్పులు పడటం వల్ల మాట పడక తప్పదు. జీవిత భాగస్వామితో తలెత్తిన వివాదాలు క్రమేణా సమసిపోతాయి. కాంట్రాక్టర్లకు రావలసిన ధనం సకాలంలో అందకపోవడంతో ఒత్తిడి, చికాకులు ఎదుర్కొంటారు. 
 
మీనం: మీ స్థోమతకు మంచిన వాగ్ధానాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. స్త్రీల ప్రతిభకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. మీ కళత్ర మొండి వైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ఉద్యోగస్తులకు పెండింగ్ పనులు పూర్తి కావడంలో సహోద్యోగుల సహకారం లభిస్తుంది. బ్యాంకు పనులు చికాకులను కలిగిస్తాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు