20-04-2020 సోమవారం దినఫలాలు - మల్లిఖార్జునుడిని ఆరాధిస్తే సంకల్పసిద్ధి

సోమవారం, 20 ఏప్రియల్ 2020 (05:00 IST)
మేషం : హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఏ విషయంలోనూ ఒంటెత్తు పోకడ, అనాలోచితంగా మాట ఇవ్వడం మంచిదికాదు. దంపతుల మధ్య దాపరికం అనర్థాలకు దారితీస్తుంది. బంధువులు, సోదరుల మధ్య సత్సంబంధాలు నెలకొంటాయి. చేతి వృత్తుల వారికి సంతృప్తి, పురోభివృద్ధి. 
 
వృషభం : స్త్రీలకు షాపింగ్‌లో దుబారా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మీ చిన్నారుల మొండివైఖరి మీకు ఎంతో చికాకుల కలిగిస్తుంది. ఆత్మీయుల నడుమ విలువైన కానుకలిచ్చిపుచ్చుకుంటారు. గృహంలో ఒక శుభకార్యం నిర్విఘ్నంగా పూర్తవుతుంది. ఇతరులకు ఉచిత సలహా ఇచ్చి ఇబ్బందులకు గురికాకండి. 
 
మిథునం : మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది. ఎదురు చూడకుండానే మీకు కొత్త అవకాశాలు లభిస్తాయి. గృహావసరాలకు నిధులు సమకూర్చుకుంటారు. సోదరీ, సోదరులతో ఏకీభవించలేకపోతారు. క్రీడల పట్ల, కళల పట్ల ఆసక్తి పెరుగును. నిరుద్యోగులు చేపట్టిన ఉపాథి పథకాల్లో నిలదొక్కుకుంటారు. 
 
కర్కాటకం : అవగాహనలేని వ్యాపారాలు, వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిదని గమనించండి. మీ ప్రయాణాలకు, కార్యక్రమాలకు స్వల్ప ఆటంకాలు ఎదురవుతాయి. ఇతరులు మీ పట్ల ఆకర్షితులౌతారు. క్రయ విక్రయాలలో మెళకువ వహించండి. వ్యాపారాలకు, రేషన్ డీలర్లకు అధికారుల వేధింపులు అధికం.
 
సింహం : వ్యాపారాల విస్తరణలు, సంస్థల స్థాపనలకు కావలసిన అనుమతులు మంజూరవుతాయి. స్త్రీలకు అపరిచిత వ్యక్తులపట్ల మెళకువ అవసరం. మీడియ రంగాల వారికి ఒత్తిడి, చికాకులు అధికం. ఆత్మీయులు, కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయు యత్నాలు ఫలిస్తాయి. 
 
కన్య : ఫైనాన్స్, చిట్స్ వ్యాపారులకు ఖాతాదారులతో సమస్యలు తలెత్తుతాయి. స్త్రీలు గృహోపకరణ వస్తువులను అమర్చుకుంటారు. ముఖ్యుల కోసం మీ పనులు వాయిదా వేసుకోవలసి వస్తుంది. ఆత్మీయులు, కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. ప్రముఖుల కలయిక అనుకూలించినా ఆశించిన ఫలితం ఉండదు. 
 
తుల : రాజకీయ నాయకులకు కార్యకర్తల వల్ల చికాకులు తప్పవు. స్త్రీలకు దూర ప్రయాణాలలో పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. యోగ, ఆరోగ్య విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. బంధుమిత్రులతో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. కొబ్బరి, పండ్లు, పానీయ, చిరు వ్యాపారులకు కలిసిరాగలదు. 
 
వృశ్చికం : కార్యసాధనలో అనుకూలత, ప్రత్యర్థి వర్గాలపై విజయం సాధిస్తారు. మత్స్యుకోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. ధనవయ్యం విపరీతంగా ఉన్నా సార్ధకత ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్ల విషయంలో పునరాలోచన అవసరం. వాయిదాపడిన మొక్కుబడులు తీర్చుకుంటారు. 
 
ధనస్సు : వేళతప్పి భోజనం, శారీరక శ్రమవల్ల ఆరోగ్య మందగిస్తుంది. మీ ఓర్పు, నేర్పులకిది పరీక్షా సమయం. వృత్తులవారికి బాధ్యతలు పెరుగుతాయి. దైవ కార్యక్రమాల పట్ల ఏకాగ్రత అధికమవుతాయి. కష్టసమయంలో ఆత్మీయులు చేదోడు వాదోడుగా నిలుస్తాయి. స్త్రీలు పనివారలతో సమస్యలు ఎదుర్కొంటారు. 
 
మకరం : ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరించండి. ఖర్చులు ప్రయోజనకరంగా ఉంటాయి. క్రయ, విక్రయాలు ప్రతికూలత లెదుర్కొంటారు. స్త్రీలకు వైద్య సలహాలు, ఔషధ సేవనం తప్పవు. నిరుద్యోగులకు ప్రకటనల విషయంలో అప్రమత్తత అవసరం. రవాణా రంగంలోని వారికి లాభదాయంగా ఉంటుంది. 
 
కుంభం : ఆర్థికస్థితి సామాన్యంగా ఉంటుంది. ద్విచక్ర వాహనంపై దూరప్రయాణాలు మంచిదికాదు అని గమనించండి. ఖర్చులు, అవసరాలకు సరిపడు ధనం సమకూర్చుంటారు. గృహంలో ఒక శుభకార్యానికి అనువైన పరిస్థితులు నెలకొంటాయి. బంధువుల ఆకస్మికరాకతో కొంత అసౌకర్యానికి లోనవుతారు. 
 
మీనం : నూతన పెట్టుబడులు, లీజు, ఏజెన్సీలకు సంబంధించిన ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. అవివాహితులలో నూతనోత్సాహం చోటుచేసుకుంటాయి. విదేశాలలోని క్షేమ సమాచారాలు తెలుసుకుంటాయి. వృత్తులవారికి శ్రమకు తగిన ఆదాయం లభిస్తుంది. రుణం ఏ కొంతైనా తీర్చాలన్న మీ సంకల్పం నెరవేరుతుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు