3-06-2017 మీ రాశి ఫలితాలు... అసలైన శక్తిసామర్థ్యాలు...
శుక్రవారం, 2 జూన్ 2017 (21:35 IST)
మేషం : పాతమిత్రుల కలయిక వల్ల గత స్మృతులు జ్ఞప్తికి వస్తాయి. సినిమా, కళా రంగాల్లో వారికి ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. స్త్రీల వాక్చాతుర్యమునకు మంచి గుర్తింపు లభిస్తుంది. అసలైన శక్తిసామర్థ్యాలు మిమ్మల్ని పరిపూర్ణ వ్యక్తులుగా తీర్చిదిద్దుతుంది. మీ అతిథి మర్యాదలు బంధుమిత్రులను ఆకట్టుకుంటాయి.
వృషభం : కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. స్త్రీలకు తల, కాళ్లు, నరాలు, ఎముకలకి సంబంధించిన చికాకులను ఎదుర్కొంటారు. ఔదార్యమున్న స్నేహితులు మీ ఆర్థికావసరాలకు అందివస్తారు. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. సభ, సమావేశాల్లో పాల్గొంటారు.
మిథునం : ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు. రాజకీయ, కళారంగాల వారికి విదేశీ పర్యటనలుంటాయి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఎగుమతి, దిగుమతి వ్యాపారస్తులకు జాయింట్ వ్యాపారస్తులకు శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. సోదరి, సోదరుల మధ్య మనస్ఫర్ధలు తలెత్తుతాయి.
కర్కాటకం: శారీరక శ్రమ, అకాల భోజనం వల్ల స్వల్ప అస్వస్థతకు గురవుతారు. ఉపాధ్యాయులకు నూతన వాతావరణం నిరుత్సాహం కలిగిస్తుంది. కోర్టు వ్యవహారాల్లో మెళకువ అవసరం. ట్రాన్స్పోర్టు, ట్రావెలింగ్, మెకానికల్ రంగాల వారికి అన్నివిధాల కలిసిరాగలదు. గతంలో జరిగిన తప్పుల నుంచి మంచిని నేర్చుకోండి.
సింహం : శ్రమాధిక్యత, అకాల భోజనం వంటి చికాకులు తప్పవు. కుటుంబంలో చికాకులు తొలగి ప్రశాంతత నెలకొంటుంది. కళలు, క్రీడల పట్ల ఆసక్తి పెంచుకుంటారు. గణిత, సైన్స్ రంగాల్లోవారికి లాభదాయకంగా వుండగలదు. కీలకమైన వ్యవహారాలు మీ జీవితభాగస్వామికి తెలియజేయటం మంచిది.
కన్య : అకాల భోజనం, శ్రమాధిక్యత వల్ల స్వల్ప అస్వస్థతకు గురవుతారు. రాజకీయ రంగాల వారికి ఆకస్మిక విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. విజ్ఞతగా వ్యవహరించి ఒక సమస్యను పరిష్కరిస్తారు. జూదాల్లో ధననష్టం, చికాకులు ఎదుర్కొంటారు.
తుల : ఆర్థిక విషయాల్లో ఒక అడుగు ముందుకు వేస్తారు. మీ మౌనం వారికి గుణపాఠమవుతుంది. నిర్మాణ పనులు, మరమ్మతులలో ఏకాగ్రత వహించండి. బంధువుల నుంచి కొత్త విషయాలు గ్రహిస్తారు.
వృశ్చికం : బ్యాంకు వ్యవహారాల్లో మెళకువ అవసరం. పత్రికా ప్రైవేట్ రంగాల్లోని వారికి మార్పులు అనుకూలం. పారిశ్రామిక రంగంలో వారికి తగిన గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తాయి. ఆలయాలను సందర్శిస్తారు. విదేశీయానం కోసం చేసే యత్నాలు అనుకూలిస్తాయి. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో మెలకువ వహించండి.
ధనుస్సు : కుటుంబ సౌఖ్యం, వాహనయోగం పొందుతారు. స్త్రీలకు పనివారితో చికాకులు తప్పవు. అత్యవసరంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఎప్పటి నుంచి వాయిదా పడుతూ వస్తున్న పనులు పునః ప్రారంభిస్తారు. పెద్దల ఆరోగ్య విషయంలో మెళకువ అవసరం. విదేశీయానం కోసం చేసే యత్నాలు అనుకూలిస్తాయి.
మకరం : మీ ఉన్నతిని చూసి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. రావలసిన ధనం అందుతుంది. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి అనుకున్నది సాధిస్తారు. సన్నిహితుల వైఖరిలో మార్పు ఆవేదన కలిగిస్తుంది. మీపై సన్నిహితుల మాటల ప్రభావం అధికంగా ఉంటుంది. మీ కళత్ర వైఖరి మీకు చికాకులు తప్పవు.
కుంభం : ఆర్థిక వ్యవహారాల్లో భాగస్వామి వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. ఇతరులను విమర్శించడం వల్ల మాటపడక తప్పదు. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలను చేపడతారు. ఆర్థిక లావాదేవీలు సమర్థంగా నిర్వహిస్తారు. ఆకస్మికంగా ప్రయాణం చేయవలసివస్తుంది. చెల్లింపులు, షాపింగ్ వ్యవహారాల్లో మెలకువ వహించండి
మీనం: ఆడిటర్ల, అకౌంట్స్ రంగాల వారికి పనిభారం తగ్గుతుంది. నిరుద్యోగం ఆలోచనలు ఉపాధి పథకాల దిశగా ఉంటాయి. పెద్దల ఆరోగ్యంలో మెళకువ అవసరం. మీ సంతానంతో ఉల్లాసంగా గడుపుతారు. తొందరపడి సంభాషించడం వల్ల ఇబ్బందులకు గురికాక తప్పదు. పెద్దల ఆరోగ్యంలో జాగ్రత్త వహించండి.