చింతచెట్టులో దుష్టశక్తులు నివాసముంటాయట..

గురువారం, 3 జనవరి 2019 (15:43 IST)
గోరింటాకులో లక్ష్మీదేవి నివాసముంటుంది. సాత్త్విక గుణం కలిగిన ఈ మొక్క ఇంట్లో వుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. గోరింటాకు విత్తనాలను నిద్రించేటప్పుడు దిండుకింద వుంచి నిద్రిస్తే చెడు స్వప్నాలు రావని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. అలాగే రుద్రాక్ష చెట్టు శివునికి ప్రీతికరం. రుద్రాక్ష చెట్టు నుంచి విడుదలయ్యే సాత్త్విక గుణాలు క్రోధాన్ని నిరోధిస్తాయి. 
 
రుద్రాక్షను ధరించడం ద్వారా రక్తశుద్ధి అవుతుంది. తద్వారా రక్తపోటు వంటి వ్యాధులు నిరోధించబడతాయి. మనశ్శాంతి చేకూరుతుంది. ఉసిరి చెట్టు.. విష్ణువుకు ప్రీతికరం. ఈ చెట్టు కింద దంపతులను కూర్చునిబెట్టి అన్నదానం చేసినట్లైతే.. సకల సౌభాగ్యాలు చేకూరుతాయని విశ్వాసం. సకల పాపాలు తొలగిపోతాయి. బిల్వ చెట్టును పరిశీలిస్తే.. బిల్వ పత్రాలు, పుష్పాలు శివునికి ప్రీతికరం. అలాంటి వాటితో శివునికి అర్చన, పూజలు చేయిస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. 
 
ఇకపోతే, వేపచెట్టు పార్వతీదేవి అంశంగా పరిగణింపబడుతుంది. ఈ చెట్టుకు పసుపుకుంకుమ రాసి చుట్టూ చీరను కట్టి, మాలను సమర్పించుకుంటే.. శక్తిమాత అనుగ్రహం లభిస్తుంది. తులసి మొక్క తప్పకుండా ప్రతి ఇంటా వుండాలి. ఇది ఔషధంగా ఉపయోగపడుతుంది. ఈ తులసి మహాలక్ష్మి స్వరూపం. అందుకే తులసీ మొక్కలో విష్ణువు కూడా నివాసముంటాడని పంచాంగ నిపుణులు సూచిస్తున్నారు. 
 
కానీ చింతచెట్టును ఇంటి పరిసరాల్లో వుంచకూడదని వారు హెచ్చరిస్తున్నారు. చింతచెట్టు చెడు ప్రభావానికి కారణమవుతుంది. చింతచెట్టు నీడ వ్యాధులకు కారణమవుతుంది. చింతచెట్టులో దుష్టశక్తులు నివాసముంటాయని.. ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు