గురు ప్రదోషం నేడు. ఈ రోజున పరమేశ్వరుడిని పూజించేటప్పుడు ఎరుపు లేదా గులాబీ రంగు దుస్తులను ధరించాలి. శివలింగానికి బిల్వా పత్రాలు, ధూపం, దీపం, చందనం, గంగాజలం, నీరు, పండ్లు, పువ్వులు, మిఠాయిలు మొదలైన వాటిని సమర్పించాలి.
సాయంత్రం ప్రదోష వేళలో జరిగే పూజలో పాల్గొన్నాలి. శివుడిని నిష్ఠతో పూజించాలి. నటరాజ స్వామి నందీశ్వరుని కొమ్ములకు మధ్యలో ఆడే సమయాన్నే ప్రదోష కాలం, ప్రదోష సమయం అంటారు. ప్రదోష కాలంలో నటరాజ స్వామిగా శివ స్వరూపుడు చేసే నృత్యాన్ని వీక్షించేందుకు శివాలయాలకు విచ్చేస్తారని విశ్వాసం.