దుర్గాదేవికి నిమ్మకాయ మాల సమర్పిస్తే?

మంగళవారం, 18 జులై 2023 (15:14 IST)
Lemon Garland
శ్రావణ మంగళవారం నాడు దుర్గాదేవిని నిమ్మకాయతో పూజించాలి. మంగళవారం రోజున అమ్మవారికి రాహుకాలంలో నిమ్మకాయ దీపం వెలిగించడం, నిమ్మకాయల మాల సమర్పిస్తే సర్వశుభాలు చేకూరుతాయి. ఇంకా పసుపుకుంకుమలను ధరిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. 
 
దుర్గాదేవి పూజ సంతోషాన్నిస్తుంది. మంగళ, శుక్రవారాలు రాహుకాలంలో దీపం వెలిగించాలి. ఇంకా రాహుకాలంలో దుర్గాదేవిని నిమ్మకాయతో పూజించడం వల్ల ఎనలేని పుణ్యఫలం లభిస్తుందని విశ్వాసం. రోజూ మూలమంత్రం చదివి పూజించవచ్చు. 
 
అలా చేయలేని వారు మంగళ, శుక్ర, ఆదివారాల్లో రాహుకాల సమయంలో గానీ, ఉదయం సాయంత్రం గానీ పూజలు చేయవచ్చు. ముఖ్యంగా కర్కాటక రాశి వారు ఆలయాన్ని సందర్శించి అమ్మవారిని పూజించాలి. 
 
పసుపు, పాలు అభిషేకానికి ఇవ్వడం మంచిది. రాహుకాలంలో సమీపంలోని ఆలయాన్ని సందర్శించడం వల్ల అనుకున్న కోరికలు నెరవేరుతాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు