చర్మ సంబంధిత వ్యాధులు తొలగిపోతాయి. వివాహం కాని కన్యలకు పెళ్లి అవుతుంది. సత్ సంతానం కలుగుతుంది. అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. పెరుమాళ్ల వారి సన్నిధికి వెళ్లే వారు ముందుగా గరుడుని దర్శించుకోవాలి. తర్వాతే స్వామిని దర్శించుకోవాలి. ఇది వైష్ణవ ఆగమ పద్ధతి. ఆలయంలో కుంభాభిషేకం జరిగేటప్పుడు గరుడాళ్వార్ ఆకాశంలో తిరగడం చేస్తేనే ఆ కుంభాభిషేకం సంపూర్ణం అవుతుందని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.
గరుడాళ్వార్ దర్శనం: ఆదివారం చేస్తే వ్యాధులు నయం అవుతాయి. సోమవారం దర్శించుకుంటే.. కుటుంబ సౌఖ్యం, మంగళవారం గరుడ దర్శనంతో ఆరోగ్యం చేకూరుతుంది. బుధవారం శత్రుభయం వుండదు. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. శుక్రవారం గరుడ దర్శనంతో లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. శనివారం గరుడ దర్శనంతో మోక్షం లభిస్తుంది.