నేడు లోక్‌సభ ముందుకు రైల్వే బడ్జెట్!

మంగళవారం, 8 జులై 2014 (08:56 IST)
లోక్‌సభలో 2014-15 సంవత్సరానికి గాను రైల్వే బడ్జెట్‌ను కేంద్ర రైల్వే శాఖామంత్రి సదానంద గౌడ ప్రవేశపెట్టనున్నారు. కేంద్ర రైల్వే మంత్రి హోదాలో ఆయన తొలిసారిగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు. ఇప్పటికే ప్రయాణ ఛార్జీలను 14.2 శాతం, సరకు రవాణా ఛార్జీలను 6 శాతం పెంచిన కేంద్ర ప్రభుత్వం... బడ్జెట్లో ఏం చేయబోతోందా? అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. 
 
ప్రయాణికుల ద్వారా వచ్చే ఆదాయం గణనీయంగా పడిపోయిన నేపథ్యంలో, రైల్వే మంత్రి విభిన్న రీతిలో బడ్జెట్‌ను ప్రవేశపెడతారనే అంచనాలు ఉన్నాయి. కొత్త రైళ్లు, నూతన రైల్వే మార్గాల విషయంలో కూడా సదానంద వాస్తవిక దృక్పథంతో వ్యవహరించనున్నట్టు సమాచారం. లాభదాయకం కాని ప్రాజెక్టులను రద్దు చేయడానికి కేంద్రం ఏ మాత్రం వెనుకడుగు వేయదనే సంకేతాలను ఇప్పటికే ఆయన పంపించారు. 

వెబ్దునియా పై చదవండి