లక్ష్మీదేవికి ఎన్ని పేర్లు.. శ్రీలక్ష్మీ కటాక్షం కోసం?
సోమవారం, 12 ఆగస్టు 2013 (16:11 IST)
FILE
శ్రీలక్ష్మీదేవి సర్వైశ్వర్యాలను, సకల సౌభాగ్యాలను ప్రసాదించే సిరులతల్లి! సకల సంపదలకు అధిదేవత శ్రీమహాలక్ష్మీదేవిని పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి. నిత్య, సత్య స్వరూపిణి అయిన ఆ తల్లి అనుగ్రహం వల్లనే మనం శాశ్వతమైన ఆనందాన్ని పొందగలం.
ఈ సృష్టిలో సమస్త జీవులలో చైతన్యరూపంలో ఉండే ఆ తల్లి కరుణవల్లనే మనకు అవసరమైన శక్తియుక్తులు సమకూరుతుంటాయి. నిత్యం శ్రీలక్ష్మీదేవిని ఆరాధించేవారి ఇంట్లో సమస్త శుభాలు నెలకొంటాయి.
జగన్మాత లక్ష్మీదేవిని శ్రీ, కమల, విద్యామాత, విష్ణుప్రియ, హరిప్రియ, ఇందిర, రమ, భార్గవి, పద్మహస్త, పద్మాక్షి, పద్మాలయ, నిత్య, సత్య, సర్వగత, మహాదేవి, లోకమాత, శ్రీదేవి, మాధవి, సీత, ఈశ్వరి, సర్వ, శుభ మంగళ, సింధుజ, నీళ, ఫలప్రద, నారాయణి, వరారొహ, నారాయణి, హిరణ్మయి, పద్మధారిణి, వంటి అనేక పేర్లతో ధ్యానించుకుంటూ ఉంటాము. ఫలితంగా ఆ తల్లి కృపాకటాక్ష వీక్షణాలకు పాత్రులమవుతుంటాము.