కలలో సముద్రం కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసా?

బుధవారం, 11 జులై 2018 (11:03 IST)
సాధారణంగా కలలు అనేవి అందరికీ వస్తుంటాయి. మనస్సు బాగోలేనప్పుడు వచ్చే కలలు ఆందోళన కలిగించేవిగా ఉంటాయి. ఇక మనస్సు సంతోషంగా ఉన్నప్పుడు వచ్చే కలలు ఆహ్లాదకరంగా ఉంటాయి. అంటే మనస్సును ఎక్కువాగ ప్రభావితం చేసే విషయాలే దృశ్యరూపాన్ని సంతరించుకుని కలలుగా వస్తుంటాయి.
 
అలాంటి కలలు ఎలాంటి ఫలితాలను ఇవ్వవట. మనస్సు సాధారణమైన స్థితిలో ఉన్నప్పుడు తెల్లవారుజామున వచ్చే కొన్నికలలు మాత్రమే ఫలితాన్ని చూపుతాయని చెప్పబడుతోంది. ఈ నేపథ్యంలో ఒక్కోసారి సముద్రం కూడా కలలో కనిపించే అవకాశం లేకపోలేదు. సహజంగా సముద్రాన్ని బయటచూస్తేనే కొంతమందికి మనసంతా అలజడిగా అనిపిస్తుంది.
 
ఆ హోరు కెరటాలు పోటీపడుతున్నట్టుగా దూసుకుంటూ రావడం ఒకరకమైన భయాన్ని కలిగిస్తుంది. అందువలన కలలో సముద్రం కనిపించినా ఆందోళన కలుగుతుంది. ఆ తరువాత నిద్రపట్టనివ్వవు గనుక వచ్చిన కల తెల్లవారిన తరువాత కూడా గుర్తుంటుంది. కలలో సముద్రం కనిపిస్తే కష్టాలను ఎదుర్కోవలసి వస్తుందనే సూచనగా భావించాలని చెప్పబడుతోంది.
 
అయితే జీవితమే ఒక సముద్రం సమస్యలా, సుడిగుండాల ఆశలే కెరటాలు తీరమే గమ్యంగా చెప్పబడుతుంది. కాబట్టి కొత్తగా వచ్చిన కలను గురించి ఆందోళన చెందవలసిన పనిలేదు. ఇలాంటి కలలు వచ్చినప్పుడు ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండేలా చూసుకుంటే సరిపోతుంది. భగవంతుడి అనుగ్రహంతో బయటపడలేని కష్టం ఈ విశ్వంలోనే లేదనుకుంటే మనసు మరింత తేలికగా ఉంటుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు