అయితే, మరికొందరు ఇంట్లో కొన్ని వస్తువులు పెట్టుకుంటే ధనవంతులుగా మారిపోతారని భావిస్తుంటారు. ఇదేవిషయాన్ని కూడా పెద్దవాళ్లు సూచన చేస్తుంటారు. కానీ కొన్ని వస్తువులు మాత్రం చాలా హానికరమట. వాటిని పెట్టుకోవడం వల్ల ఇంటికి మంచిది కాదు. అలాగే పేదరికం వెంటాడుతుందని చెబుతోంది వాస్తుశాస్త్రం. అయితే ఇలాంటి విషయాలను చాలా మంది మూఢనమ్మకంగా భావిస్తారు.
చాలామంది ఇంటిపైకప్పును డంపింగ్ యార్డ్‌లా మార్చేస్తుంటారు. పాత ఫర్నిచర్, పాత వస్తువులన్నింటినీ.. ఇంటి మేడపై పడేస్తారు. టెర్రస్‌ని ఇలా మార్చడం వల్ల.. దురదృష్టం ఎదురవుతుంది, పేదరికం పట్టిపీడిస్తుంది. వెంటనే దాన్ని శుభ్రం చేసుకుంటే మంచిదని వాస్తు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.