చాలామంది శివుభక్తులు పరమేశ్వరుని తులసి మాలలతో ఆరాధిస్తుంటారు. ఈ మాసంలో తులసి కోటను పూజిస్తే పరమేశ్వరుని పూజించినట్టవుతుందని నమ్మకం. కనుక ఇంట్లో తులసి కోట లేని వారు వెంటనే కోటను అమర్చుకుంటే మంచిది. ఈ మాసంలో ప్రతిరోజూ ఉదయాన్నే లేచి స్నానమాచరించి కొత్త దుస్తులు ధరించాలి. ఆ తరువాత పూజగదిని శుభ్రం చేసుకుని ఈశ్వరుని అలంకరించి వారికి నచ్చిన పిండి వంటలను నైవేద్యాలుగా సమర్పించి.. శివనామాన్ని జపిస్తూ పూజలు చేస్తే.. అష్టైశ్వర్యాలు వెల్లువిరుస్తాయని పండితులు చెప్తున్నారు.