ఆవుపాలు, అన్నం, బెల్లంతో పాయసం తయారు చేసి చిక్కుడు ఆకులు లేదా ఏదైన పల్లెంలో సూర్యదేవుడికి నివేదించాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. ఆదిత్యహృదయం, సూర్యష్టకం పారాయణం చేయాలి.
నీటిలో బెల్లం , ఎర్రటి పువ్వులు వేసి అర్ఘ్యం చేయండి. రథ సప్తమి నాడు స్నానమాచరించి పూజ చేసిన తరువాత పేద బ్రాహ్మణునికి పప్పు, బెల్లం, రాగి, గోధుమలు, ఎరుపు లేదా నారింజ వస్త్రాన్ని దానం చేయడం ద్వారా దీర్ఘాయువు ప్రాప్తిస్తుంది.