హనుమంతుడికి మంగళవారం నాడు అలా చేస్తే....?

సోమవారం, 23 ఏప్రియల్ 2018 (18:05 IST)
సాధారణంగా ఒక్కో రోజు ఒక్కో దేవుడిని, దేవతలను పూజిస్తుంటాం. అయితే మంగళవారం ఆంజనేయస్వామిని పూజించడం వల్ల మనకు శుభం జరుగుతుంది. కొంతమంది మంగళవారం ఆంజనేయస్వామి గుడికి వెళ్లడం, మరికొందరు ఉపవాసం చేయడం లాంటివి చేస్తుంటారు. మరి మంగళవారం స్వామిని ఎలా పూజిస్తే మంచి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం...
 
1. సంతానం లేని దంపతులు మంగళవారం నాడు ఆంజనేయస్వామికి పూజ చేసి ఉపవాసం ఉంటే పిల్లలు త్వరగా కలుగుతారు. ఏమైనా దోషాలు ఉంటే వెంటనే తొలగిపోతాయి. దుష్టశక్తుల ప్రభావం తొలగి మంచిపిల్లలు పుడతారు.
 
2. మంగళవారం నాడు ఎరుపురంగు దుస్తులు ధరించి హనుమంతుడిని పూజించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. మన సమస్యలు తొలుగుతాయి. అంతేకాకుండా స్వామిని మంగళవారం నాడు ఎరుపు రంగు పూలతో పూజించడం వల్ల స్వామి ఆశీస్సులు ఎక్కువగా లభిస్తాయి. ముఖ్యంగా గ్రహ దోషాలు ఉంటే పోతాయి. జీవితంలో ఎక్కువ సమస్యలు ఉన్నవారు ఈ విధంగా స్వామిని పూజిస్తే మంచి ఫలితం ఉంటుంది.
 
3. దీర్ఘకాలిక అనారోగ్యంతో  బాధపడేవారు ప్రతి మంగళవారం నాడు హనుమంతుని పూజించడం వల్ల ఆ సమస్య నుండి బయటపడవచ్చు. అలాగే మనకు ఎలాంటి సమస్య ఉన్నా హనుమాన్ చాలీసా పఠించడం వల్ల పరిష్కారం వెంటనే లభిస్తుంది. అదృష్టం కలసి వస్తుంది. ఆర్థికపరమైన సమస్యల నుండి బయటపడవచ్చు.
 
4. హనుమంతుడిని ప్రతి మంగళవారం పదకొండు తమలపాకులను స్వామి నామం చదువుతూ సమర్పించాలి. అలాగే స్వామివారి ఆలయానికి వెళ్లి పదకొండు ప్రదక్షిణాలు చేయడం అనేది ఎన్నో సమస్యలకు చక్కటి పరిష్కారం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు