అష్టాదశ శక్తి పీఠాల్లో మొదటి శక్తిపీఠం ఎక్కడుంది?

గురువారం, 14 ఫిబ్రవరి 2013 (17:33 IST)
FILE
కోనేశ్వరం దేవాలయాన్నే తిరుకోనేశ్వరం అని పిలుస్తారు. ఇది శ్రీలంకలో ఉన్న అతి ప్రాచీన దేవాలయాల్లో ఒకటి. ఇది అష్టాదశ శక్తి పీఠాల్లో మొదటిది. ఈ ప్రాంతాన్ని తిరుకోనమలై అని కూడా అంటారు. కున అంటే తమిళంలో తూర్పు అని అర్ధం. 2500 సంవత్సరాల క్రితం విజయుడు రాజుగా ఇక్కడికి రావడానికి ముందు నుంచే ఈ దేవాలయం ఉందని నమ్ముతారు.

దేవాలయం పరిసరాల్లో బయల్పడిన అనేక విగ్రహాలు ఈ ప్రాంతం పల్లవరాజులదేనని చెబుతారు. ఈ దేవాలయాన్ని పరిరక్షించడంలో చోళ, పాండ్య రాజులు కూడా తమ వంతు కృషి చేశారు. ఈ దేవాలయానికి తమిళ రాజు కుళకోత్తముడు మరమ్మత్తులు చేయించాడని ప్రతీతి

వెబ్దునియా పై చదవండి