మీరు సింహరాశిలో జన్మించారా?

సింహ రాశిలో జన్మించిన జాతకులు ఎల్లప్పుడు చురుకుదనంతో దర్శనమిస్తారు. ఇతరులకు సహాయపడే దయాగుణం వీరికుంటుంది. అయితే కారణం లేని విషయాలకు ఆగ్రహం చెందడం వీరి స్వభావం. ఇతర రాశులకు చెందిన జాతకుల కంటే సామర్థ్యవంతులుగా ఉంటారు. అనుకున్న కార్యాన్ని పూర్తి చేసే వరకు ఎలాంటి కష్టానైనా ఎదుర్కొంటారు.

ఇతరుల వద్ద ప్రేమతో వ్యవహరించడం వీరి నైజం. మితమైన పొగడ్తలను ఆశించే ఈ జాతకులు సామాజిక సేవలో ఆసక్తి చూపుతారు. జీవితాన్నిలక్ష్యవంతంగానే కొనసాగిస్తారు. ఆత్మవిశ్వాసంతో కార్యాచరణ జరపడంతో సమర్థులు.

ఇకపోతే.. ఈ జాతకులు చేపట్టే ప్రతి కార్యం పలువురికి ఉపయోగకరంగా ఉంటుంది. ఇతరులపై అధికారం చెలాయిస్తూ, బంధువులకు, స్నేహితులకు సన్నిహితంగా ఉంటారు. వేదాంత సారాంశాలపై మిక్కిలి మక్కువను కలిగియుంటారు. ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరిస్తారు. అంతేగాకుండా ఇతరులను అదే త్రోవలో నడిపించడానికి ప్రయత్నిస్తారు. ప్రయాణాలంటే వీరికి ఆసక్తి. శ్రమించి పనిచేయటం ద్వారా మంచి సుఖభోగాలను అనుభవిస్తారు.

వృత్తిపరంగా రాణించే ఈ జాతకులు రచయితలు, సంగీత విద్వాంసులు వంటి ఉన్నత పదవులను అలంకరిస్తారు. తాను చేసే కార్యమే సరియైనదని వాదించే నిపుణులు. ఉష్ణానికి సంబంధించిన వ్యాధులు ఈ జాతకులను అప్పుడప్పుడు ఇక్కట్లకు గురిచేస్తాయి.

ఇకపోతే ఈ రాశిలో జన్మించిన మహిళలు ఇతరులను ఆకట్టుకునే చర్మ సౌందర్యాన్ని కలిగి ఉంటారు. జీవితంలో ఎటువంటి కార్యాన్నైనా సులభంగా సాధిస్తారు. ఉద్యోగంలో అధికారుల ఆదరణతో పాటు వారి మన్ననలను పొంది ఉన్నత పదవులను అలంకరిస్తారని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి