విజయవాడ : అమ్మలగన్న అమ్మ బెజవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో కార్తీక దీపోత్సవం ఘనంగా జరిగింది. నవ్యాంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా దుర్గగుడిలో లక్ష దీపోత్సవాన్ని నిర్వహించారు. ఘాట్ రోడ్డులో దేవాలయాలు, ఉపాలయాలు, దుర్గా మల్లేశ్వర ఆలయం, మెట్ల మార్గాలలో దీపోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహోదీపోత్సవాన్ని డ్రోన్ కెమెరాతో చిత్రీకరించారు.
పరిపూర్ణానందస్వామి ఈ దీపోత్సవంలో పాల్గొని అనుగ్రహ భాషణం అందించారు. ఈ కార్యక్రమంలో ఏపీ శాసన సభ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ దంపతులు, గద్దె అనూరాధ, వేదాంతం రాజగోపాల్ దుర్గగుడి ఈవో సూర్యకుమారి దీపాలు వెలిగించి మహాదీపోత్సవాన్ని ప్రారంభించారు. దీపాల అనంతరం కనకదుర్గమ్మ ఆలయ పరిసర ప్రాంతాలన్నీ కోటికాంతులతో వెలుగొందాయి. భక్తులందరికీ కనువిందు చేశాయి.