ఇళయరాజాకు ఆలయంలో అవమానం.. వీడియో వైర‌ల్

ఠాగూర్

సోమవారం, 16 డిశెంబరు 2024 (13:09 IST)
త‌మిళ‌నాడు రాష్ట్రం విరుదునగర్ జిల్లా శ్రీవిల్లిపుత్తూరులో ఉన్న ఆండాళ్ దేవాలయంలో గ‌ర్భ‌గుడి (అర్థ మండపం)కి వెళ్లిన ప్రముఖ సంగీత దర్శకుడు ఇళ‌యరాజాను అక్క‌డున్న పూజారులు బ‌య‌ట‌కు పంపించించి వేశారు. ఇళయరాజాను గర్భగుడిలోకి వెళ్లకుండా ఆలయ పూజారులు అడ్డుకున్నారు. దీంతో ఆయన వెనక్కి తిరిగి వచ్చేశారు. దీనికి సంబంధించిన వీడియో దృశ్యాలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. 
 
అయితే, కొందరు వేదపండితులు మాత్రం మరోలా స్పందిస్తున్నారు. అది అవమానం కాదని, ఆలయ సంప్రదాయమంటున్నారు. శ్రీ చక్రం వేసిన గర్భగుడిలోకి పూజారులు మినహా ఇతరులు ఎవరూ ప్రవేశించడానికి వీల్లేదని అభిప్రాయపడుతున్నారు. 

 

ఇళయరాజాకు ఆలయంలో అవమానం.. వీడియో వైర‌ల్

త‌మిళ‌నాడులోని శ్రీవిల్లిపుత్తూరులో ఉన్న ఆండాళ్ దేవాలయంలో గ‌ర్భ‌గుడికి వెళ్లిన ఇళ‌యరాజాను అక్క‌డున్న పూజారులు బ‌య‌ట‌కు పంపించిన దృశ్యాలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. pic.twitter.com/SatsWGHhGA

— greatandhra (@greatandhranews) December 16, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు