స్టాక్ మార్కెట్లు గురువారం కూడా నష్టాల్లో ముగిశాయి. గురువారం నాటి ట్రేడింగ్‌కు ముగిసే సమయానికి 202 పాయింట్ల మేరకు నష్టపోయి 26,838 వద్ద ముగిసింది. అలాగే, నిఫ్టీ కూడా 59 పాయింట్లు నష్టపోయి 8,112 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఈ పతనం ట్రేడింగ్ నాలుగో సెషన్‌లో సంభవించింది. యుఎస్ ఫెడరల్ రిజర్వు బ్యాంకు వచ్చే డిసెంబర్ నెలలో వడ్డీ రేట్లను తగ్గించవచ్చన్న సంకేతాల నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.
ఈ ట్రేడింగ్‌లో ప్రధానంగా భెల్, యాక్సిస్ బ్యాంకు, సన్ ఫార్మా, కోల్ ఇండియా, ఎస్.బి.ఐ, హెచ్‌యుఎల్, ఐటీసీ, భారతీ ఎయిర్‌టెల్, గెయిల్, హిండాల్కో, ఎల్ అండ్ టి, మారుతి సుజుకి, టీసీఎస్, ఇన్ఫోసిస్ కంపెనీల షేర్లు బాగా నష్టపోగా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, వేదాంత, టాటా మోటార్స్, రిల్, బజాజ్ ఆటో, హీరో మోటాకార్ప్, టాటా స్టీల్ కంపెనీల షేర్లు లాభాల్లో పయనించాయి.
ఇకపోతే.. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు కూడా స్వల్పంగా తగ్గాయి. 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.26,801ల వద్ద ఉంది. కేజీ వెండి ధర రూ.37,164ల వద్ద ఉంది. డాలర్ మారకం విలువ రూ.65.16లుగా ఉంది.