రేసింగ్‌లో ప్రమాదం... శ్రేయాస్ హరీశ్ దుర్మరణం

సోమవారం, 7 ఆగస్టు 2023 (10:27 IST)
చెన్నైకు చెందిన శ్రేయాస్ హరీశ్ దుర్మరణం పాలయ్యాడు. రేసింగ్ కోర్టులో జరిగిన ప్రమాదంలో ఈ కుర్రోడు ప్రాణాలు కోల్పోయాడు. స్పెయిన్‌లో జరిగిన వరల్డ్ ఛాంపియన్షిప్ ఫైనల్‌కు చేరిన తొలి ఇండియన్ బైక్ రేసర్ 13 యేళ్ల శ్రేయాస్ హరీష్... చెన్నైలో నేషనల్ మోటార్ సైకిల్ రేసింగ్ చాంపియన్‌షిప్ జరిగిన రేసింగ్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. 
 
బెంగళూర్ కిడ్‌గా పేరొందిన శ్రేయాస్ బైక్ నుంచి పడిపోయినప్పుడు 200సీసీ మోటార్ బైకును నడుపుతున్నాడు. రేస్ మూడో రౌండ్ సందర్భంగా ఈ ప్రమాదం జరిగింది. శ్రేయాస్‌ను వెంటనే ఆస్పత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మరణించాడని వైద్యులు తెలిపారు. శ్రేయాస్ మరణంతో వారాంతంలో జరగాల్సిన మిగిలిన రేసింగ్ పోటీలను చేసినట్టు మద్రాస్ మోటార్ స్పోర్ట్స్ క్లబ్ వెల్లడించింది. 
 
శ్రేయాస్ జులై 26న తన 13వ పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్నాడు. శ్రేయాస్ 2022లో భార్‌లో ఎఫ్ఎం మిని-జిప్‌లో తన కెరీర్‌ను ప్రారంభించి చాంపియన్ షిప్‌ను కైవసం చేసుకున్నాడు. ఆపై జాతీయ చాంపియన్‌షిప్‌లోనూ పాల్గొన్న శ్రేయాస్‌ను టీవీఎస్ రూకీ కప్‌కు ఎంచుకుంది.
 
యువ రేసర్‌ను ప్రోత్సహించిన టీవీస్ అతడికి శిక్షణ ఇప్పించడంతో పాటు రేస్‌ల కోసం టీవీఎస్ బైకు అందించింది. రూకీ క్యాటగిరీలో తొలి నాలుగు రేసుల్లో శ్రేయాస్ విజేతగా నిలిచాడు. దేశంలోనే సామర్ధ్యం కలిగిన రేసర్లలో ఒకటిగా నిపుణులు శ్రేయాస్‌ను గుర్తించాడు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు