Sania Mirza: సానియా మీర్జా- మహ్మద్ షమీ పెళ్లి ఫోటోలు వైరల్.. నిజమేనా?

సెల్వి

మంగళవారం, 24 డిశెంబరు 2024 (12:18 IST)
Sania_shami
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా- క్రికెటర్ మహ్మద్ షమీలు త్వరలో వివాహం చేసుకోబోతున్నారనే వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే, వీరి పెళ్లి నిజం కాదు. ఆ ఫొటోలు ఫేక్. కొందరు ఆకతాయిలు ఏఐ సాయంతో సానియా, షమీ పెళ్లి చేసేశారు. ఏఐ ద్వారా రూపొందించిన వీరి ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 
 
ఇప్పటికే సానియా మీర్జా షోయబ్ మాలిక్‌కు విడాకులు ఇచ్చింది. ప్రస్తుతం ఆమె తన కుమారుడితో కలిసి దుబాయ్‌లో ఉంటోంది. అలాగే టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీ తన భార్య హసీన్ జహాన్‌కు దూరంగా ఉంటున్నాడు. ప్రస్తుతం షమీ ఒంటరిగానే జీవితాన్ని గడుపుతున్నాడు. 
Sania Mirza- Mohammed Shami
 
ఈ నేపథ్యంలో వీరి ఫ్యాన్స్ వీరిద్దరూ ఒక్కటైతే బాగుంటుందని అంటున్నారు. ఇంకా వీరు త్వరలో వివాహం చేసుకుంటారని టాక్ వస్తోంది. మరి ఈ వార్తలు, లీక్ అయిన ఏఐ ఫోటోలపై సానియా, షమీ ఎలా స్పందిస్తారో అనేది వేచి చూడాలి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు