బట్టతల ఉండటంతో దాన్ని కవర్ చేసేందుకు విగ్గులు పెట్టుకుని, స్టైలిష్‌గా లుక్ మార్చుతూ అందులో ఫొటోలు అప్లోడ్ చేసేవాడు. దీంతో అతడి ప్రొఫైల్ నిజమని నమ్మిన పలువురు అమ్మాయిలను పెళ్లి చేసుకుని, లక్షల కట్నం దండుకుని కొన్నాళ్లకు ముఖం చాటేస్తాడు.
నగరానికి చెందిన ఓ లేడీ డాక్టర్ను కూడా ఇలానే పెళ్లి చేసుకుని మోసం చేశాడు. అతడి మోసాన్ని పసిగట్టిన డాక్టర్.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో వంశీకృష్ణపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, గతంలోనూ ఈ నిత్యపెళ్లికొడుకు పలుమార్లు అరెస్ట్ అయి జైలుకు వెళ్లి వచ్చినట్లు తెలిసింది.