కామన్వెల్త్ క్రీడల్లో భారత హవా - నాలుగో పతకం

ఆదివారం, 31 జులై 2022 (09:37 IST)
కామన్వెల్త్ క్రీడల్లో భారత్ హవా కొనసాగుతోంది. భారత బిల్డర్లు తమ సత్తా చాటుతున్నారు. 23 యేళ్ల బింద్రారాణికి రజత పతకం వరించింది. ఒక్క కేజీ బరువు తేడాతో బంగారు పతకాన్ని కోల్పోయింది. పసిడి పతకాన్ని నైజీరియా లిఫ్టర్ అదిజాత్ ఒలారినోయ్ సొంతం చేసుకుంది. 
 
బర్మింగ్‌హామ్ వేదికగా ఈ కామన్వెల్త్ పోటీలు జరుగుతున్నాయి. భారత వెయిట్‌లిఫ్టర్లు తమ హవాను కొసాగిస్తున్నారు. రెండో రోజున నాలుగు పతకాలతో ముగిసింది. తొలి రోజున సంకేత్ సర్గర్ రజత పతకం సాధించి భారత్ ఖాతాలో తొలి పతకాన్ని చేర్చాడు. 
 
ఆ తర్వాత గురురాజ్ పుజారీ కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఆ తర్వాత మణిపూర్‌కు చెందిన వెయిట్‌లిఫ్టింగ్ క్వీన్ మీరాబాయి చాను స్వర్ణ పతకంతో మెరిసింది. తొలి రోజు ఆఖరులో 23 యళ్ల బింద్యారాణి రజత పతకాన్ని సొంతం చేసుకుని, భారత్‌కు నాలుగో పతకాన్ని అందించింది 
 
55 కేజీల విభాగంలో పోటీపడిన బింద్యారాణి స్నాచ్‌లో 86 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 116 కేజీలతో మొత్తంగా 202 కేజీలు ఎత్తి రజత పతకాన్ని గెలుచుకుంది. నైజీరియాకు చెందిన అదిజాత్ బంగారు పతకాన్ని కేవసం చేసుకుంది. బింద్యారాణి 202 కేజీల బరువు ఎత్తగా, అదిజాత్ 203 కేజీల బరువు ఎత్తింది. కేవలం ఒక్క కేజీ తేడాతో బంగారు పతకం చేజారిపోయింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు