కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌ బోణీ.. వెయిట్ లిఫ్టింగ్‌లో తొలి పతకం

శనివారం, 30 జులై 2022 (17:30 IST)
Sagar
కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌ బోణీ కొట్టింది. బర్మింగ్‌హామ్‌ వేదికగా జరుగుతున్న ఈ పోటీల్లో మన దేశానికి తొలి పతకం లభించింది. ఈ పతకాన్ని మహారాష్ట్రకు చెందిన 21 ఏళ్ల వెయిట్ లిఫ్టర్ సంకేత్ మహదేవ్ సర్గర్ సాధించి పెట్టారు. 55 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో ఆయన రజత పతకం (సిల్వర్ మెడల్) కైవసం చేసుకున్నారు. 
 
ఈ పోటీల్లో స్వర్ణమే లక్ష్యంగా బరిలోకి దిగిన సంకేత్‌.. మొత్తం 248 కేజీల బరువును (స్నాచ్‌లో 113 కేజీలు, సీ ఎండ్‌ జేలో 135 కేజీలు) ఎత్తి తన లక్ష్యానికి (స్వర్ణం) కేవలం ఒక్క కిలో దూరంలో నిలిచిపోయాడు. 
 
ఇక మలేషియాకు చెందిన మహమ్మద్ అనిల్ మొత్తం 249 కేజీలు ఎత్తి స్వల్ప తేడాతో సంకేత్‌ను అధిగమించాడు. దీంతో అతన్ని స్వర్ణ పతకం వరించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు