ఆసక్తికరంగా సాగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో డెన్మార్క్‌పై తొలి నుంచి ఇంగ్లండ్ జట్టే ఆధిపత్యం ప్రదర్శించింది. 30వ నిమిషంలో డెన్మార్క్ ఆటగాడు డ్యామ్స్‌గార్డ్ పెనాల్టీ కిక్‌ను అద్భుతంగా గోల్ చేసి ఆ జట్టును ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. అయితే డెన్మార్క్ ఆటగాళ్ల తప్పిదంతో ఇంగ్లండ్ (39 నిమిషాల్లో) స్కోర్‌ను సమం చేసింది. ఆపై ఇరు జట్లు మరో గోల్ చేయలేదు. దీంతో నిర్ణీత సమయంలో డెన్మార్క్, ఇంగ్లండ్ జట్లు చెరో గోల్ చేసి సమంగా నిలవడంతో ఆట ఆదనపు సమయానికి దారితీసింది.
అదనపు సమయంలో ఇంగ్లండ్ అందివచ్చిన అవకాశాన్ని అద్భుతంగా ఉపయోగించుకుంది. ఇంగ్లీష్ ఆటగాడు హారీ కేన్ పెనాల్టీ కిక్‌ను గోల్‌గా (104వ నిమిషంలో) మలిచాడు. డెన్మార్క్ పోరాడినా మరో గోల్ చేయలేకపోయింది. దీంతో డెన్మార్క్ ఓటమిని చవిచూసింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 10 సార్లు గోల్ లక్ష్యం దిశగా వెళ్లగా.. డెన్మార్క్ కేవలం మూడు సార్లు మాత్రమే వెళ్లింది. ఇదే డెన్మార్క్ ఓటమికి కారణమైంది.