రియో స్విమ్మింగ్ పూల్ క్లోజ్.. ఆకుపచ్చ నీరు.. స్విమ్మర్లకు అనారోగ్యం తలెత్తకుండా?

శనివారం, 13 ఆగస్టు 2016 (16:30 IST)
రియో ఒలింపిక్స్ ఏర్పాట్లలో ఆ దేశ సర్కారు విఫలమైంది. ఇంకా రియో ఒలింపిక్స్‌ను చూసే ప్రేక్షకుల సంఖ్య కూడా బాగా తగ్గిపోవడంతో బ్రెజిల్ ఈ నష్టం నుంచి గట్టెక్కేందుకు ఇప్పడే ఆలోచిస్తుంది. దోపిడీలు, దాడులు, వ్యభిచారం వంటివి ఒలింపిక్ గ్రామం చుట్టూ భూతాల్లా తిరుగుతున్న నేపథ్యంలో రియో ఒలింపిక్స్‌లో బ్రెజిల్ సర్కారు ఏర్పాట్లు ఆటగాళ్లను నిరాశపరుస్తున్నాయి. 
 
తాజాగా రియోలోని మారియా లెంక్ అక్వాటిక్స్ సెంటర్‌లోని ఒక స్మివ్మిుంగ్ పూల్‌ను క్లోజ్ చేశారు. ఇందుకు కారణం.. స్విమ్మింగ్ పూల్ నీరు ఆకుపచ్చ రంగులో మారిపోవడమే. ముందుగా ఈ స్విమ్మింగ్ పూల్ నీరు ఆకుపచ్చగా ఉంటే పట్టించుకోని అధికారులు.. ఆపై సీరియస్ అయ్యారు. నీటి నాణ్యతపై దృష్టి పెట్టారు. అందుకే పూల్‌ను మూతపెట్టేశారు. 
 
నీటిని శుద్ధి చేయడానికి, స్విమ్మర్లకు అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉండేందుకుగాను ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆ నీటిలో కొన్ని రకాల రసాయనాలు కలపడం వంటి చర్యలు తీసుకుంటున్నారు. 

వెబ్దునియా పై చదవండి